హ్యాపీడేస్ యాక్టర్.. ఏకంగా రూ.100కోట్ల కథతో న్యూ మూవీ.. ఈసారైనా హిట్ కొడతాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట హిట్ సినిమాతో అడుగుపెట్టి కనిపించకుండా పోయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఎంత మంచి సినిమాలు చేసినా కూడా మరికొందరు అవకాశాలు రాకనో లేక సినిమాల సెలక్షన్ విషయాల్లో పొరపాటు చేసో కెరీర్ ని ఇరకాటంలో పెట్టుకున్నారు. అదే తరహాలో బ్యాడ్ లాక్ తో ఇబ్బందిపడ్డ హీరో రాహుల్. తెలుగు ఆడియెన్స్ లో ఇతను ఒక మంచి టైజన్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.
Recommended Video

చిరకాలం గుర్తిండిపోయేలా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. అందులో నటించిన వారికి కూడా చిరకాలం గుర్తుండిపోయేలా గుర్తింపును అందించింది ఆ సినిమా.

ఊహించని విదంగా దెబ్బకొట్టింది..
ఇక హ్యాపీడేస్ లో లీడింగ్ హీరో వరుణ్ సందేశ్ అయినప్పటికీ మిగతా వారికి అతనికంటే ఎక్కువ క్రేజ్ దక్కింది. ముఖ్యంగా టైజన్ పాత్ర ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా తరువాత టైజన్ రాహుల్ ఎక్కువగా సక్సెస్ అవ్వలేదు. చేసిన ప్రతి సినిమా ఊహించని విదంగా దెబ్బకొట్టింది.

ఆ సినిమాతో హిట్ కొట్టాలని..
మొదట విఎన్.ఆదిత్య దర్శకత్వంలో రెయిన్ బో అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎలాంటి లాభాన్ని ఇవ్వలేదు. ఇక ఆ తరువాత ఎంతో జాగ్రత్తలు తీసుకొని మరి వెంకటాపురం అనే సినిమా చేశాడు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్దగా లాభాలను అందించలేకపోయింది. ఇక రాహుల్ తన ప్రయత్నాలను ఏ మాత్రం ఆపడం లేదు.

100క్రోర్స్ మూవీతో హిట్ కొడతాడా?
గత రెండేళ్లుగా 100క్రోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ ను తెరపైకి ప్రయత్నాలు చేస్తున్నాడు రాహుల్. ఫైనల్ గా ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశాడు. చూస్తుంటే ఈ సినిమా డబ్బుకు సంబంధించిన థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా మనోడు బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











