మరోసారి ఫిట్‌నెస్‌తో షాక్ ఇచ్చిన హ్యాపీడేస్ టైసన్.. యాక్షన్ సినిమా కోసం బాహుబలి లాంటి లుక్కు

2007లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన హ్యాపీడేస్ సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తరువాత నటీనటులకు ఒక్కసారిగా ఆఫర్స్ వచ్చాయి. అయితే వాటిని సరైన క్రమంలో వాడుకున్న వారు మాత్రమే క్లిక్కయ్యారు. టైసన్ గా కనిపించిన రాహుల్ హరిదాస్ కూడా పెద్దగా క్లిక్కవ్వలేకపోయాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలను ఆపడం లేదు. ఇక ప్రస్తుతం అతని లుక్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

మొదటి అవకాశం..

మొదటి అవకాశం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో వర్క్ చేయాలని ప్రతి ఒక్క నటీనటులకు ఉంటుంది. కానీ ఆయన సినిమాల్లో ఛాన్స్ కొట్టేయ్యాలి అంటే ఎవరికి ఉండని టాలెంట్ ఉండాలి. ఒక పాత్రకు మనిషి సెట్టయ్యడాని తెలిస్తే శేఖర్ కమ్ముల అతన్ని పూర్తిగా మార్చేసి మరి యాక్టర్ గా సెట్ చేస్తారు. ఆ విధంగా ఓనమాలు నేర్చుకొని క్లిక్కయిన నటుడే రాహుల్.

ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక..

ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక..

హ్యాపీడేస్ సినిమా వచ్చి ఇప్పటికి 13ఏళ్ళు దాటినా కూడా జనాలు ఆ సినిమాను ఏ మాత్రం మరచిపోలేదు. టీవీల్లో ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ సినిమా మంచి రేటింగ్స్ అందుకుంటోంది. అందులో నటించిన వారిలో తమన్నా, నిఖీల్ స్టార్స్ గా ఫామ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిగతా వారు మాత్రం ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక కొంతమంది నట జీవితానికి వీడ్కోలు పలికారు.

రాహుల్ మాత్రం అస్సలు తగ్గడం లేదు

రాహుల్ మాత్రం అస్సలు తగ్గడం లేదు

ఇక రాహుల్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆ మూవీలో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ బక్కోడా అనే డైలాగ్ తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతైనా మన ఫ్రెండే కదరా.. అనే డైలాగ్ అప్పట్లో ఎంతగానో వైరల్ అయ్యింది. ఇక ఆ సినిమా అనంతరం రాహుల్ కు అడపాదడపా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆ సినిమాలేవి క్లిక్కవ్వలేదు.

బాహుబలిలా కండలు పెంచేసి..

బాహుబలిలా కండలు పెంచేసి..

ఇక లాభం లేదని రాహుల్ తన ఆలోచనను మార్చుకున్నాడు. తనను తాను సరికొత్తగా చూపించుకోవాలని ఏకంగా ఫిట్నెస్ లో భారీ మార్పులు చేశాడు. బాహుబలిలా కండలు పెంచాలని గత కొన్ని నెలలుగా వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా దాదాపు అనుకున్న లుక్కులోకి మారాడు.

యాక్షన్ సినిమా కోసం

యాక్షన్ సినిమా కోసం

నాలుగేళ్ళ క్రితం వెంకటాపురం అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో బాగానే ఆకట్టుకున్నప్పటికి ఆ సినిమా కమర్షియల్ గా హిట్టవ్వలేదు. ఇక ప్రస్తుతం 100క్రోర్స్ అనే ఒక యాక్షన్ సినిమా చేస్తున్న రాహుల్ ఆ సినిమా కోసమే ఫిట్నెస్ లో భారీగా మార్పులు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన న్యూ లుక్ ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. మరి సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X