100కోట్ల సినిమా కోసం.. సిక్స్ ప్యాక్ లుక్‌తో షాక్ ఇచ్చిన హ్యాపీడేస్ టైజన్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా వచ్చి 14 ఏళ్లయినా కూడా ఇంకా టీవీలలో మంచి రెంటింగ్ అందుకుంటోంది. ఇక అందులో నటించిన నటీనటులు కూడా జీవితానికి సరిపడే గుర్తింపును అందుకున్నారు. అయితే అందులో అర్జున్ టైజన్ పాత్రను కూడా ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే ప్రస్తుతం అతనికి సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా హ్యాపీడేస్. దిల్ రాజు ఆ సినిమాను తక్కువ రేటుకు కొనుక్కొని భారీ స్థాయిలో విడుదల చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని ఆయనకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక సినిమాలో వరుణ్ తేజ్, తమన్నా, నిఖీల్, వంటి వాళ్లకు ఒక మంచి బూస్ట్ ఇచ్చింది.

ఆ ఒక్క డైలాగ్ తో..
అయితే ప్రస్తుతం ఆ సినిమా తరువాత ఎక్కువగా క్లిక్కవ్వని వారిలో రాహుల్ హరిదాస్ ఒకరు. ఎంతైనా మన ఫ్రెండే కదరా.. అనే సింపుల్ డైలాగ్ తోనే అతను ఆడియెన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. అయితే ఎందుకో గాని మళ్ళీ రాహుల్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

హ్యాపీడేస్ తరువాత..
రెయిన్ బో.. అనే సినిమాలో అతనికి వెంటనే అవకాశం వచ్చించి గాని వర్కౌట్ కాలేదు. ఇక ఆ తరువాత సరైన కథలలను సెలెక్ట్ చేసుకోవాలని వెయిట్ చేసి ముగ్గురు, ప్రేమ ఒక మైకం అనే సినిమాలు చేశాడు. అవేమి అంతగా క్లిక్కవ్వలేదు. ఇక లవ్ యూ బంగారం, వెంకటాపురం అంటూ డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలకు ప్రమోషన్ కూడా గట్టిగానే చేశాడు గాని వర్కౌట్ కాలేదు.
అక్షిత బోప్పయ్య హోమ్లీ లుక్.. అక్కింటి అమ్మాయిలా అందంతో
100కోట్ల సినిమా కోసం.. సిక్స్ ప్యాక్
ఇక 2017 తరువాత మళ్ళీ కనిపించని రాహుల్ ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ 100కోట్లు. ఇటీవల ఓ పోస్టర్ కూడా విడుదల చేశాడు. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో రాహుల్ ఒక యాక్షన్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఆ పాత్ర కోసం అతను సిక్స్ ప్యాక్ కూడా సెట్ చేసుకున్నాడు. ఎలాగైనా ఈ సారి మంచి హిట్ కొట్టాలని కష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











