పగలంతా ప్రజల కోసం, రాత్రుళ్లు షూటింగ్.. హరిహర వీరమల్లు వెనుక పవన్ కష్టం తెలుసా?
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమైంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. అప్పుడెప్పుడో బ్రో చిత్రం తర్వాత రెండేళ్లకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడాయన గతంలో మాదిరిగా కాదు.. ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధినేత. పాలన, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎలా పూర్తి చేశారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రజల కోసం కెరీర్‌ను పక్కనపెట్టి
తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్‌వన్ హీరోగా, రోజుకు 2 కోట్లు పారితోషికం తీసుకునే నటుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ తనను ఇంతటి వాడిని చేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ- బీజేపీ కూటమికి మద్ధతు పలికిన పవన్ కళ్యాణ్ నాడు కూటమి విజయంలో కీలకపాత్ర పోషించారు. సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో రాజకీయాలపై ఓ కన్నేసేవారు. 2019 ఎన్నికల నాటికి కూటమిలో విబేధాలతో బయటికొచ్చేసిన పవర్‌స్టార్.. ఒంటరిగా బరిలో దిగి దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్
పార్టీ చిత్తుగా ఓడిపోవడమే కాకుండా తను పోటీ చేసిన రెండు చోట్లా పరాజయజం పాలవ్వడం పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చింది. పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సూత్రానికి అనుగుణంగా ఈసారి పక్కా ప్రణాళికతో పనిచేసిన పవన్ .. బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని వెళ్లారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ- టీడీపీ- జనసేన కూటమిలో కీలకపాత్ర పోషించిన పవన్.. సీట్ల పంపకాల విషయంలోనూ సరిపెట్టుకున్నారు. ప్రజలు కూడా వెన్నుదన్నుగా నిలబడటంతో 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు నాయుడు నాలుగో సారి సీఎం కాగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
పెండింగ్ సినిమాలపై పవన్ ఫోకస్
ఈ పరిణామాలు పవన్ అభిమానులకు సంతోషాన్ని కలిగించినా.. ఓ వైపు బాధ ఉంది. పవన్ 2024 ఎన్నికల బరిలో దిగడానికి ముందు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరమల్లు, ఓజీల షూటింగ్‌ను కూడా చాలా వరకు పూర్తి చేశారు. కానీ అనుకోని విధంగా రాజకీయాలకే సమయం కేటాయించాల్సి రావడంతో ఈ సినిమాలను పక్కన పెట్టేశారు. ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎం కావడంతో పాలన, రాజకీయాలతోనే సమయం సరిపోతోంది. అయితే తను కమిటైన సినిమాలను పూర్తి చేయాలని పవన్ నిర్ణయించారు. ముందుగా హరిహర వీరమల్లును ట్రాక్ ఎక్కించారు.
వీరమల్లును పూర్తి చేసిన పవన్
పాలన, రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూనే వీరమల్లు కోసం కొంత సమయం కేటాయించి ఎంతో కష్టపడ్డారు. పగలు షూటింగ్ చేస్తూ.. రాత్రి డబ్బింగ్ చెబుతూ నిద్రలేని రాత్రుళ్లు గడిపేవారు. పగలు మళ్లీ యథావిధిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవల కేవలం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ కంప్లీట్ చేసి సినిమాపై తన డెడికేషన్‌ను, అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో సినిమా పట్ల పవన్ అంకిత భావాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











