Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20 ముందు టీమిండియాకు బూస్ట్.. డ్రెస్సింగ్ రూంలో లెజెండ్!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Hari Hara Veera Mallu: మరో లుక్ వైరల్.. రెండు కోణాల్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయి అమాంతంగా ఆకాశాన్ని దాటేసింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని పవర్ స్టార్ అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సమరయోధుడిగా కనిపించబోతున్నాడు. ఉన్నవాడి దగ్గర నుంచి దొంగతనం చేసి లేనివారికి ఇచ్చే ఒక రాబిన్ హుడ్ తరహలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

చరిత్రలోని కొన్ని నిజమైన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరొక ఫోటోను గమనిస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇంతకుముందు విడుదలైన కొన్ని పోస్టర్స్ ను చూస్తే అందులో పవన్ కళ్యాణ్ గడ్డం లేకుండా చాలా క్లీన్ షేవింగ్ తో కనిపించాడు.
అయితే ఇటీవల ఒక మహిళా అభిమానితో దిగిన ఫోటోలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలోనే గడ్డంతో కనిపిస్తున్నాడు. అంటే దర్శకుడు పవన్ కళ్యాణ్ ను రెండు విభిన్నమైన కోణాల్లో చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ కానున్నాయి అని నిర్మాత ఇది వరకే తెలియజేశారు. ఇక తప్పకుండా ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుంది అని కూడా దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఖుషి నిర్మాత ఏఎమ్.రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకగా కనిపించనుంది.