పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు ఇష్యూస్ క్లియర్.. షూట్ అప్పటి నుంచే!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిలిచిపోయింది అని ప్రచారం జరిగింది కానీ అసలు ఎందుకు సినిమా నిలిచిపోయింది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ ఊసే లేకుండా పోయింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారని ఇప్పుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

క్రియేటివ్ డిఫరెన్సెస్
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా నిలిచి పోయింది. అయితే దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. హరిహర వీరమల్ల రషెష్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ క్రిష్ కి సూచించారని తెలుస్తోంది.

పూర్తవుతుందా లేదా?
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పవన్ కొన్ని మార్పులు చూపులు సూచించడంతో క్రిష్ అందుకు ఒప్పుకోలేదని అవి మారిస్తే బాగోదని పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో పవన్ కళ్యాణ్ అప్పటికి షూటింగ్ నిలిపివేశారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. సైలెంట్ గా ఒక తమిళ సినిమా రీమేక్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడం కూడా ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని అనేక అనుమానాలకు తెర తీసింది.

తలనొప్పిగా
దానికి తోడు అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్ర చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఉంటుందా లేక నిలిపివేసినట్లేనా అని అనుమానాలు కూడా తలెత్తాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమానే నమ్ముకుని ఎలా అయినా ఈ సినిమా చేసి అప్పుల నుంచి బయటపడాలని చూస్తున్న ఏం రత్నంకి ఈ సినిమా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా ఎక్కువైంది.

మీటింగ్ లో చర్చలు
కరోనా దెబ్బ పడటంతో రెండేళ్ల నుంచి షూటింగ్ జరుగుతున్నా సినిమా సగం కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ఎలాగోలా ఒప్పించి సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ మధ్య ఎఏం రత్నం మీటింగ్ కుదిరిచ్చారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులు చేసి సినిమా చేసే విధంగా ఈ మీటింగ్ లో చర్చలు జరిగాయని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలోనే తాను చేసిన మార్పులకు దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఆగస్టు నుంచి మళ్లీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ లోపు సినిమా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి క్లారిటీ రావడంతో పవన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











