వరుణ్ తేజ్, హరీష్ శంకర్ 'వాల్మీకి' షూటింగ్ ప్రారంభం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ ప్రతి చిత్రంలో తనదైన శైలిలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ కొత్త చిత్రం లాంచ్ అయింది. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'వాల్మీకి' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గురువారం రోజు షూటింగ్ ప్రారంభమైనట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్ లో ప్రకటించాడు. కొత్త టీమ్ తో జాయిన్ అయ్యేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని వరుణ్ తేజ్ తెలిపాడు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్తాండకు ఇది రీమేక్. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడు.

వరుణ్ తేజ్ పాత్రని హైలైట్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. జిగర్తాండ చిత్రంలో బాబీ సింహా పోషించిన నెగిటివ్ రోల్ కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రలోనే వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











