బాలయ్య అందుకే కొట్టాడు.. అసలు విషయం బయటపెట్టిన యువ హీరో
సెహారి చిత్ర ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనడం అందర్నీ విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ కార్యక్రమంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఈవెంట్‌లో యువ హీరో, హీరోయిన్లను ఆటపట్టించిన తీరు కూడా క్రేజీగా మారింది. ఫస్టులుక్ రిలీజ్ సందర్భంగా యువ హీరో హర్షను చేతిపై కొట్టడం కూడా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా హీరో హర్ష వివరణ ఇస్తూ..

సికింద్రాబాద్, హైదారాబాద్... బాలయ్యబాబు జిందాబాద్
సెహారి ఫస్ట్‌లుక్ రిలీజ్ రోజున సినీ ప్రముఖులు, అభిమానులు బాలయ్యను ఉత్సాహ పరిచారు. సికింద్రాబాద్, హైదారాబాద్... బాలయ్యబాబు జిందాబాద్.., కోకాకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ యాంకర్ కూడా బాలయ్యలో ఉత్సాహాన్ని పెంచారు. దాంతో బాలయ్య ఎప్పటిలానే వేదికపై చలాకీగా కనిపించారు.

మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు నిర్మాతగా
సెహారి చిత్రాన్ని తన స్నేహితుడు, క్లాస్‌మెట్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మిస్తున్నారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ కుటుంబం నుంచి యువకుడు నిర్మాతగా రావడం చాలా సంతోషంగా ఉంది. వారు స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో కాదనలేకపోయాను అని బాలకృష్ణ తెలిపారు.

కరోనాకు మంత్రం చిట్కా
యువ హీరో హర్ష కనుమిల్లి జన్మదినం రోజును పురస్కరించుకొని సెహారి ఫస్ట్‌లుక్‌ను బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరోనావైరస్‌కు వ్యాక్సిన్ రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కాబట్టి చాలా మందికి నేను ఓ మంత్రం ఉపదేశించాను. అది చదివితే రోగ నిర్ధారక శక్తి పెరుగుతుంది అంటూ చిన్న చిట్కాలు చెప్పారు.

యువ హీరో చేతిపై బాలయ్య మొట్టికాయ
ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ ఉత్సాహంగా కనిపించారు. యువ హీరో, హీరోయిన్లతో సరదాగా, చిలిపిగా ఉంటూ కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పట్టుకొని మీడియాకు స్టిల్స్ ఇచ్చే క్రమంలో హీరో హర్ష చేయిపై ఒక్కటించారు. దాంతో పోస్టర్‌ను వదిలేయడం కనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ చేతితో ఆ పోస్టర్‌ను పట్టించారు. అనంతరం హర్షను కూడా చేతితో పట్టుకోమని చెప్పడం కనిపించింది .

బాలయ్య ఎందుకు కొట్టారంటే..
అయితే తన చేతిపై బాలయ్య ఎందుకు కొట్టారనే విషయంపై యువ హీరో హర్ష వివరణ ఇచ్చారు. పోస్టర్‌ను పట్టుకొనే సమయంలో నా ఎడమ చేతిని ఉపయోగించాను. అలా ఎడమ చేతితో పట్టుకోవడం శుభం కాదు. అందుకే బాలయ్య నా ఎడమ చేతిపై కొట్టాడు. కుడి చేతితో పట్టుకొమని బాలకృష్ణ చెప్పారు అని హర్ష తెలిపారు.
Recommended Video

బాలయ్య నిష్ణ, నియమాల గురించి
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ముహుర్తాలు, సంప్రదాయాలు, ఆచారాలు, పూజలు, పునస్కరాలు పాటించడంలో నటసింహం ముందుంటారు. చెప్పిన సమయానికి రావడం, వేదికపై సంస్కారం పాటించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకొంటారు. పలు సందర్భాల్లో అలాంటి విషయాలు సాక్ష్యంగా నిలిచాయి.


Click it and Unblock the Notifications











