డెలివరీ బాయ్‌గా జాన్ అబ్రహంను కలిశా.. ఆ సమయంలో నా పరిస్థితి అంటూ హర్షవర్ధన్ ఎమోషనల్
టాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటుడు హర్షవర్ధన్ రాణే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల తాప్సీ పన్నుతో కలిసి హసీన్ దిల్‌రుబా చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయన పాత్రపై ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో తన సినిమా కష్టాలను మీడియాతో పంచుకొన్నారు.
2004 సంవత్సరంలో ఓ కంపెనీకి సంబంధించిన డెలీవరీ బాయ్‌గా పనిచేశారు. ఆ సమయంలో నటుడు జాన్ అబ్రహంకు హెల్మెట్ ఇచ్చాను. అదే నటుడు నిర్మిస్తున్న తారా వర్సెస్ బిలాల్ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చారు అని తెలిపారు.

నేను డెలీవరీ బాయ్‌గా పనిచేస్తూ జాన్ అబ్రహంను చూసి ఫిదా అయ్యాను. అప్పడే కాదు.. ఇప్పుడు చూసిన అదే ఫీలింగ్ కలుగుతుంది. నేను నటించే సినిమాకు నిర్మాతగా ఆయన కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సెట్లో ఉంటే కాస్త నెర్వస్‌గా కూడా ఉంటుంది అని అన్నారు.
నేను మొదటిసారి డెలివరీ బాయ్‌గా ఆయనను కలిసిన సమయంలో డొక్కు బైక్, ముఖాన మొటిమలు, చింపిరి జట్టుతో కనిపించాను. కానీ ఈ రోజు ఆయన పక్కన ఉండి.. హీరోగా చేయడం నా డెస్టినీ అని హర్షవర్ధన్ అన్నారు.
ఇక హసీన్ దిల్‌రుబా చిత్రంలో నీల్ త్రిపాఠీ పాత్రలో కనిపించారు. తన సోదరుడి (విక్రాంత్ మెస్సీ) భార్య (తాప్సీ) రొమాన్స్ చేస్తాడు. నీల్ త్రిపాఠి పాత్రకు మంచి పేరు కూడా వస్తున్నది.


Click it and Unblock the Notifications











