For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ సినిమాల్లో ఈ నెంబర్ ప్లేట్ గమనించారా ?.. అన్నిటికీ అదే నెంబర్ ఎందుకు ?

  |

  మెగాస్టార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మెగా బ్రాండ్ ను మరో లెవెల్ కి తీసుకువెళుతున్నారు. మొదటి సినిమా చిరుత తోనే హిట్ కొట్టిన ఆయన ఒక్కో సినిమాకి తనను తాను ఎంతగానో మార్చుకొని నటనలో పరిణితి పొందుతూ ముందుకు వెళ్తున్నాడు. అయితే కెరీర్ మొదట్లో సంగతి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ సినిమాల్లో కనిపిస్తున్న అన్ని వాహనాల నెంబర్ ఒకటే దర్శనం ఇస్తోంది. అదే నెంబర్ చరణ్ వాడే సొంత కార్ నెంబర్ కూడా. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  సెంటిమెంట్లు మరీ ఎక్కువ

  సెంటిమెంట్లు మరీ ఎక్కువ

  సాధారణంగా ప్రతి మనిషికి సెంటిమెంట్లు ఎక్కువే, సినిమావాళ్ళకి ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాలామంది కార్ నెంబర్ నుంచి ఫోన్ నెంబర్ దాకా తనకు బాగా కలిసి వచ్చిన నెంబర్ లు ఉండేలా చూసుకుంటారు. అందుకు ఉదాహరణగా తారక్ ఎక్కువగా 9999 నెంబర్ ఉన్న కార్లే వాడుతుంటారు. ఆయన ఫోన్ నెంబర్ లో ఎక్కువ 9లే ఉంటాయట. ఇక రామ్ చరణ్ కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారు.

  బిజీబిజీగా

  బిజీబిజీగా

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ‘ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా బాలీవుడ్ భామ ఆలియా భట్ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్ సినిమా కావడం, బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

  ఆర్ఆర్ఆర్ వాయిదా

  ఆర్ఆర్ఆర్ వాయిదా

  అందుకు తగ్గట్టు అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ లాంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి.

   ఆచార్య విత్ చిరంజీవి

  ఆచార్య విత్ చిరంజీవి

  ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యలో కూడా చరణ్ నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరస కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ మధ్య రామ్‌ చరణ్‌ ప్రీ లుక్‌ను ఆచార్య దర్శకుడు కొరటాల శివ రివీల్ చేశారు. ఆ సమయంలో సిద్ధ అనే పేరును కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న పిక్ కూడా షేర్ చేశారు. ఈ సినిమా కూడా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా వేశారు.

  ఎక్కువగా అదే నెంబర్ ఎందుకు

  అయితే ఈ విషయాలు సంగతి ఎలా ఉన్నా మీరు కనుక సరిగా గమనించినట్లు అయితే చరణ్ సినిమాల్లో వాడే వెహికల్ నెంబర్ దాదాపుగా 2727 అనే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అనే దానికి సరైన రీజన్ ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిజానికి ఆయన సొంత వెహికల్ నెంబర్ కూడా అదే. అయితే ఈ నెంబర్ ఎందుకు ఆయన వాడుతున్నారు ? ఆయనకు ఇది లక్కీ నెంబర్ ఏమో ? అనే చర్చ కూడా జరుగుతోంది.

  Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
  కొందరు అలా మరికొందరు ఇలా

  కొందరు అలా మరికొందరు ఇలా

  అలా నెంబర్ గురించి చర్చ జరిగినప్పుడు పలువురు ఆసక్తికరంగా స్పందించారు. కొంతమంది రామ్ చరణ్ పుట్టిన రోజు 27వ తారీకు కావడంతో అది ఆయనకు బాగా కలిసి వచ్చిన నెంబర్ అని అందుకే ఎక్కువ సార్లు రిపీట్ చేసి ఉంటారని అంటున్నారు. మరికొందరు టోటల్ నైన్ వస్తుంది కాబట్టి పుట్టినరోజు కూడా కలిసి వచ్చిందనే కారణంగా రామ్ చరణ్ ఇలా అదే నెంబర్ కంటిన్యూ చేస్తూ ఉండొచ్చని అంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

  English summary
  Actor ram charan is busy with RRR and Acharya Movies. In his movies Charan uses 2727 number plate for all the vehicles why he is using that number is still a question mark.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X