HBD Mahesh: మనసున్న మారాజు.. వాళ్ల కోసమే కోట్ల ఖర్చు.. మహేశ్ గురించి ఎవరికీ తెలియని నిజాలివే!

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైనా.. చిన్నతనంలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు మహేశ్ బాబు. బాలనటుడిగా మెప్పించిన అతడు.. 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సాగిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఘనతలను అందుకున్నాడు. అలా ఫుల్లుగా సంపాదిస్తోన్న ఈ స్టార్ హీరో ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అలాగే, కష్ట కాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చి ఎన్నో సేవలు చేశాడు. నేడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం!

పక్కా కమర్షియల్ హీరోగా
తెలుగులో వరుసగా సినిమాలు చేసే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే రీతిలో వెళ్తోన్న అతడు.. నిర్మాతల హీరోగా పేరొందాడు. ఇందులో భాగంగానే తొలినాళ్ల నుంచే కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, వ్యాపార ప్రకటనలు చేస్తూ, నిర్మాతగా సినిమాలు తీస్తూ మహేశ్ భారీగానే సంపాదిస్తున్నాడు.

HBD Mahesh Babu Super Star Mahesh Babu Good Works Helps and Donations Details

రెండు గ్రామాలు దత్తత

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. గతంలో గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న అతడు.. ఆ ఊరిలో అన్ని సదుపాయాలు చక్కగా ఉండేలా అభివృద్ధి చేయించాడు. అలాగే, కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచాడు.

విరాళాలు ప్రకటించాడు
సుదీర్ఘ కాలంగా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తోన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆపద సమయాల్లో ప్రజలకు, ప్రభుత్వాలను తన వంతుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. చాలా రోజుల క్రితం వచ్చిన హుద్‌హుద్ తుఫాను నుంచి నిన్నటి కరోనా పరిస్థితుల వరకు అతడు ఎన్నో విరాళాలు ప్రకటించాడు. ఇలా కోట్ల రూపాయలను అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు.

HBD Mahesh Babu Super Star Mahesh Babu Good Works Helps and Donations Details

1000 మందికి పైగా సర్జరీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన మంచి పనులు, విరాళాలు ఒక ఎత్తు అయితే.. MBForSavingHearts పేరిట చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఇప్పటి వరకూ అతడు 1000 మందికి పైగానే చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. తద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపాడు.

సమాజ సేవలో భాగంగా
సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేశ్ బాబు.. సమాజం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలందరినీ ప్రతి విషయంలోనూ అప్రమత్తం చేస్తూ పోస్టులు చేస్తుంటాడు. అంతేకాదు, ఒక యాడ్‌తో కోట్లకు కోట్లు సంపాదించే మహేశ్ బాబు సమాజం కోసం 'హీల్‌ ఏ చైల్డ్‌' అనే స్వచ్ఛంద సంస్థకు కూడా గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.

HBD Mahesh Babu Super Star Mahesh Babu Good Works Helps and Donations Details

సినిమాలతో ఆదర్శంగా

మహేశ్ బాబు హీరోగా 28 సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో చాలా వరకూ కమర్షియల్ చిత్రాలే ఉన్నా.. ఈ మధ్య కాలంలో సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా 'శ్రీమంతుడు' అనే సినిమాతో గ్రామాలను దత్తత తీసుకోవాలన్న సందేశాన్ని అందించాడు. ఆ తర్వాత 'మహర్షి'తో వ్యవసాయం చేయాల్సిన అవసరాన్ని చూపించి ప్రత్యేకంగా నిలిచాడు.

తండ్రి బాటలోనే సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినీ ప్రయాణంలో భారీగానే ఆదాయాన్ని తెచ్చుకుంటున్నాడు. కానీ, అందులో కొన్ని కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు అతడి బాటలోనే కుమార్తె సితార కూడా నడుస్తోంది. చిన్న వయసులోనే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అబ్బురపరుస్తోంది. ఇలా మహేశ్ బాబు అన్ని విధాలుగా ఆదర్శంగా ఉంటున్నాడు.

ఇదే రీతిలో కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకుంటూ.. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb29 hbdmaheshbabu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X