HBD Roshan Meka భారీ ఆఫర్లతో రోషన్ మేకా.. లుక్స్, బాడీ లాంగ్వేజ్‌తో కేక పెట్టిస్తున్న యువ హీరో
తెలుగు సినీ పరిశ్రమలో శత చిత్ర నటుడు శ్రీకాంత్ వారస్వత్వాన్ని అంది పుచ్చుకొని టాలీవుడ్‌లో రోషన్ మేకా హీరోగా ప్రవేశించాడు. రుద్రమదేవి చిత్రంలో బాలనటుడిగా ప్రవేశించిన రోషన్ తనకు తాను నిరూపించుకొంటూ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2016 సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నిర్మలా కాన్వెంట్, ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD చిత్రంలో నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. యువ హీరోగా తన ప్రతిభను చాటుకొంటున్న రోషన్ జన్మదినం మార్చి 13వ తేదీ. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ..
హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించడానికి ముందు రోషన్ మేకా పలు రకాల శిక్షణ పొందారు. ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ తర్వాత.. బాలీవుడ్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేసి.. సినిమాపై మంచి అవగాహనను పెంచుకొన్నారు.

పెళ్లి సందD చిత్రంతో లవర్ బాయ్‌గా తన కంటూ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. లుక్స్, ఆన్ స్క్రీన్ ప్రెజెనస్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. పెళ్లి సందD సినిమా తర్వాత వస్తున్న ఆఫర్లను ఆచితూచి ఎంచుకొంటున్నాడు.

ప్రస్తుతం వైజయంతీ మూవీస్, వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో సినిమాలు అంగీకరించాడు. త్వరలోనే టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాక్టర్‌గా రోషన్ కావడం తథ్యమని సినీ వర్గాలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











