ఎవడిని చంపాలో నేను నీకు చెప్పను..నేను ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు..మాఫియా డాన్‌కు షారుక్ వార్నింగ్

బాలీవుడ్‌లో కింది స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన హీరోల్లో షారుక్ ఖాన్ ఒకరని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నో సక్సెస్ పుల్ చిత్రాలతో బాక్సాఫీస్ సంచలనాలకు చిరునామాగా మారిన షారుక్ జన్మదినం నవంబర్ 2వ తేదీ. 55వ జన్మదినం జరుపుకొంటున్న షారుక్ ఖాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

టెలివిజన్ నుంచి బాలీవుడ్‌కు..

టెలివిజన్ నుంచి బాలీవుడ్‌కు..

సర్కస్ టెలివిజన్ సిరియల్‌తో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన షారుక్ ఖాన్ ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కొద్ది రోజుల్లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకొన్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ హై కి మాన్తా నహీ, దిల్ తో పాగల్ హై, బాజీగార్, దీవానా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలతో సూపర్‌స్టార్‌గా మారారు. గత 25 ఏళ్లుగా హిందీ పరిశ్రమను తన కనుసైగల్లో పాలిస్తున్నాడు.

అబు సలెం, చోటా షకీల్ నుంచి బెదిరింపులు

అబు సలెం, చోటా షకీల్ నుంచి బెదిరింపులు

ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమపై, అలాగే హీరోలపై ముంబైలోని గ్యాంగ్‌స్టర్ల ప్రభావం, బెదిరింపులు ఎక్కువగానే ఉంటాయి. అయితే తనను పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లు అబు సలెం, చోటా షకీల్ లాంటి వాళ్లు పలు మార్లు బెదిరించారనే విషయాన్ని షారుక్ ఖాన్ తన జీవిత చరిత్రగా వచ్చిన ది కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనే పుస్తకంలో రాశారు.

అబు సలెంకు వార్నింగ్

అబు సలెంకు వార్నింగ్

అనుపమ చోప్రా రాసిన ది కింగ్ ఆఫ్ బాలీవుడ్ పుస్తకం కోసం షారుక్ ఖాన్ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఓ సారి తనకు అబు సలెం ఫోన్ చేసి తన సన్నిహితుడైన ఓ ప్రొడ్యూసర్ చిత్రంలో నటించమని బెదిరించాడు. అందుకు సమాధానంగా ఎవరినైనా షూట్ చేసి చంపమని నేను నీకు చెప్పను. అలాగే నీవు కూడా నన్ను ఏ సినిమా చేయాలి? ఏ ప్రొడ్యూసర్‌తో చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు అంటూ షారుఖ్ ఖాన్ ఖరాఖండిగా చెప్పారట.

దిల్ తో పాగల్ హై సినిమా సమయంలో

దిల్ తో పాగల్ హై సినిమా సమయంలో

అబు సలెం బెదిరింపుల ఘటన యష్ చోప్రా రూపొందిస్తున్న దిల్ తో పాగల్ హై చిత్రం షూటింగు సమయంలో జరిగింది. ఆ సమయంలో మాఫియా నుంచి పెద్ద ఎత్తున్న బెదిరింపుల ఫోన్ కాల్స్ వచ్చాయి అని ది కింగ్ ఆఫ్ బాలీవుడ్ పుస్తకంలో వెల్లడించారు. మాధురి దీక్షిత్, కరిష్మా కపూర్ నటించి ఆ చిత్రం బాలీవుడ్‌లో అద్బుతమైన విజయాలను అందుకొన్న సంగతి తెలిసిందే.

Recommended Video

Cine Box : #HappyBirthdayShahRukhKhan || మరోసారి తల్లి పాత్రలో అమల
జీరో సినిమా అట్టర్ ఫ్లాప్‌తో

జీరో సినిమా అట్టర్ ఫ్లాప్‌తో

ఇక షారుఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. జీరో సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత షారుక్ ఖాన్ కెరీర్ కాస్త ఆగిపోయింది. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజు హిరానీ రూపొందించే చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X