HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతా గోవిందం వంటి హిట్ సినిమాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్థాయికి ఎదగడం ఆయన ప్రత్యేకత. ఈరోజు (మే 9) ఆయన పుట్టినరోజు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు కూడా విజయ్ కు విషెస్ తెలుపుతున్నారు. అతని మొత్తం ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.!

Also Read
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..

హైదరాబాద్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయ్.. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. చదువు పూర్తయ్యాక యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టి అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినా.. హీరోగా గుర్తింపు రావడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. మొదట్లో ఆయనకు వచ్చిన అవకాశాలు ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమయ్యాయి. కానీ తనలో ఉన్న కాన్ఫిడెన్స్, నటనపై నమ్మకం ఆయనను ముందుకు నడిపించాయి.

HBD Vijay Deverakonda From Arjun Reddy Star to Pan India Icon With Rs 70 Crore Net Worth
Recommended For You
నన్ను బలిపశువును చేశారు.. ఆ భయంతోనే అలాంటి సినిమాలు: సంజనా ఎమోషనల్
నన్ను బలిపశువును చేశారు.. ఆ భయంతోనే అలాంటి సినిమాలు: సంజనా ఎమోషనల్

'పెళ్లి చూపులు'తో మొదలైన మ్యాజిక్
2016లో విడుదలైన పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలక మలుపు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ముఖ్యంగా విజయ్ నటన, సహజమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో విజయ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీగా నిలిచింది. విజయ్ నటన యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్‌కు 'రౌడీ స్టార్' అనే ట్యాగ్ వచ్చింది. అదే సమయంలో ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.

You May Also Like
ఆ రోజు చేసిన తప్పు వల్లే ఈ స్టేజ్ లో ఉన్నా.. బిగ్ బాస్ నటుడు షాకింగ్
ఆ రోజు చేసిన తప్పు వల్లే ఈ స్టేజ్ లో ఉన్నా.. బిగ్ బాస్ నటుడు షాకింగ్

'గీత గోవిందం'తో ఫ్యామిలీ ఆడియన్స్‌
అర్జున్ రెడ్డి ద్వారా యూత్ ఐకాన్‌గా మారిన విజయ్.. గీతా గోవిందం (Geetha Govindam) సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువయ్యాడు. ఈ సినిమాలో కనిపించిన సాఫ్ట్, రొమాంటిక్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్,రష్మిక మందన్నా కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఈ మూవీ తర్వాత ఇద్దరి జోడీకి భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు విజయ్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో నిలబెట్టాయి. డియర్ కామ్రెడ్, లైగర్ వంటి చిత్రాలు మిక్స్‌డ్ రిజల్ట్స్ అందుకున్నా.. విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, యూత్ కనెక్ట్ ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది.

ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

విజయ్ దేవరకొండను ఇతర హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన యాటిట్యూడ్. ఎలాంటి విషయాన్నైనా నేరుగా చెప్పే తీరు, తన స్టైల్‌పై కాన్ఫిడెన్స్, మీడియా ముందు బోల్డ్‌గా మాట్లాడే ధోరణి యువతను ఆకర్షించాయి. చాలా మంది అభిమానులు విజయ్‌ను కేవలం హీరోగా కాకుండా ఓ యూత్ ఐకాన్‌గా చూస్తుంటారు. సినిమాల కంటే బయట ఆయన ప్రవర్తన, డ్రెస్సింగ్ స్టైల్, సోషల్ మీడియా పోస్టులు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా 'రౌడీ' బ్రాండ్‌తో ఆయన తన ఫ్యాన్ బేస్‌ను మరింత బలంగా మార్చుకున్నాడు.

150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?
150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?

లగ్జరీ లైఫ్‌స్టైల్.. కోట్ల ఆస్తులు
స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత విజయ్ లైఫ్‌స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిసరాల్లో సుమారు రూ.15 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ డిజైన్ నుంచి సౌకర్యాల వరకు ఈ ఇల్లు పూర్తిగా హైఎండ్ స్టైల్‌లో నిర్మించబడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కార్లంటే విజయ్‌కు ప్రత్యేకమైన ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో ఫోర్డ్ మస్టాంగ్ కలెక్షన్‌లో స్పెషల్ ఆట్రాక్షన్. జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన జీఎల్‌సీ మోడల్, వోల్వో ఎక్స్‌సీ90, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వంటి లగ్జరీ కలెక్షన్‌ ఉన్నాయి.

Godari Gattupaina Day 1 collections: గోదారి గట్టుపైన తొలిరోజు కలెక్షన్స్.. సుమంత్ ప్రభాస్ మూవీ పరిస్థితేంటి?
Godari Gattupaina Day 1 collections: గోదారి గట్టుపైన తొలిరోజు కలెక్షన్స్.. సుమంత్ ప్రభాస్ మూవీ పరిస్థితేంటి?

సినిమాలే కాదు.. బిజినెస్‌లలోనూ
విజయ్ దేవరకొండ కేవలం నటుడిగానే కాదు.. బిజినెస్‌మన్‌గా కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన స్థాపించిన Rowdy Wear యువతలో మంచి ఆదరణ పొందుతోంది. ట్రెండీ స్టైల్స్, యూత్ ఫ్యాషన్‌ను టార్గెట్ చేస్తూ ఈ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. అలాగే ఆయన Hyderabad Black Hawks వాలీబాల్ టీమ్‌కు కో-ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్ రంగంలో కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంటున్నారు.

మనమంటే చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు..
మనమంటే చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు..

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుతం విజయ్ దేవరకొండ నెట్ వర్త్ రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అదేవిధంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క యాడ్‌కే దాదాపు రూ.1 కోటి వరకు ఛార్జ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇక ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నను పెళ్లి చేసుకుని బ్యాచులర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేశాడు. ఈ జంటకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X