Don't Miss!
- News
సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే: కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు
- Sports
బెయిర్ స్టోను కోహ్లీ అనవసరంగా గెలికాడు.. పుజారాలా ఆడేటోడు పంత్‌లా చెలరేగాడు: సెహ్వాగ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తులు, రెమ్యూనరేషన్.. ఆ హీరోయిన్‌తో బర్త్‌డే సెలెబ్రేషన్స్
అసలు ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన ఇతగాడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. సినిమాల పరంగానే కాదు.. బ్రాండ్ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. అలాగే, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంత కాలం టాలీవుడ్లో హవాను చూపించిన అతడు.. ఇప్పుడు 'లైగర్'తో పాన్ ఇండియా స్టార్ అవబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు మీకోసం!

విజయాలతో విజయ్ కెరీర్ స్టార్ట్
'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. అలాగే, 'మహానటి'లోనూ ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి అలరించాడు.
Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు
ఆరంభంలోనే విజయ్ దేవరకొండకు ఎన్ని హిట్లు వచ్చాయో.. అదే స్థాయిలో ఫ్లాపులు కూడా పలకరించాయి. అప్పట్లో అతడు నటించిన 'ద్వారక' అనే సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూనే ఉంటోంది.

పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తూ
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

వరుసగా రెండు.. కశ్మీర్లో రచ్చ
విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినప్పటికీ అతడు పూరీ జగన్నాథ్‌తో 'జగ గణ మన' అనే సినిమాను ప్రకటించేశాడు. అలాగే, ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్లో ఉన్న విజయ్ తన పుట్టినరోజును సామ్‌తో కలిసి జరుపుకున్నాడు.

నిర్మాత, బిజినెస్ మ్యాన్, సేవ
హీరోగా తన సత్తాను నిరూపించిన విజయ్ దేవరకొండ.. బిజినెస్ రంగంలోనూ సక్సెస్ అయ్యాడు. అతడి క్లాత్ బ్రాండ్ 'రౌడీ'కి బయట ఎంతో ఆదరణ లభిస్తోంది. అలాగే, 'మీకు మాత్రమే చెబుతా'తో నిర్మాతగానూ మారాడు. ఇందుకోసం కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్‌ను సైతం స్థాపించాడు. అదే సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

ఎన్నో రికార్డులు.. ఫోర్బ్స్లోనూ
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న విజయ్ దేవరకొండ.. చాలా రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 2018 జాబితాలో 72వ స్థానాన్ని, 2019లో 30వ స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాడు. అలాగే, టాలీవుడ్‌లోని మరే హీరోకూ సాధ్యం కానీ రీతిలో ఏక కాలంలో నాలుగైదు బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

విజయ్ ఆస్తులు, రెమ్యూనరేషన్
విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగాడు. దీంతో అతడి నికర విలువ దాదాపు రూ. 35 - 40 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, అతడు ఒక్కో సినిమాకు రూ. 10 - 12 కోట్లు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క నెలకు విజయ్ యాడ్స్, సినిమాల ద్వారా కోటి రూపాయల వరకూ ఆదాయాన్ని అందుకుంటున్నాడని టాక్.
మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

ఇంటి విలువ.. కార్లు కలిపితే
విజయ్ దేవరకొండకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందట. అలాగే, ప్రస్తుతం అతడు వాడుతోన్న కార్లు ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 8 - 10 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇలా మనోడు చాలా తక్కువ సమయంలోనే తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు.
నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులను అలరిస్తోన్న విజయ్ దేవరకొండ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. అతడికి తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.