twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే రానాకు కాల్ చేయలేదు.. ఫోన్‌లోనే ఏడ్చినంత పనిచేశాడు.. నాని ఎమోషనల్‌గా..

    |

    నేచురల్ స్టార్ నాని, మళ్లీరావా ఫేం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ అందుకొంటున్నది. సినీ విమర్శకుల ప్రశంసలూ లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని, శ్రద్ధా శ్రీనాత్, రోనిత్ కమ్రా, కృష్ణకాంత్‌, నవీన్‌ నూలి, మాస్టర్‌ రోనిత్‌, విశ్వంత్‌, నవీన్‌, కొమురం, కమల్‌, కృష్ణ, సురేష్‌, అనిల్‌- భాను, నీరజ కోన, విజయ్‌, అవినాష్‌ కొల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ...

    నా ఫోన్‌లో మెసేజ్‌లు నిండి

    నా ఫోన్‌లో మెసేజ్‌లు నిండి

    జెర్సీ సినిమా రిలీజ్ తర్వాత నాకు వచ్చిన ప్రశంసలు, మెసేజ్‌లు గతంలో ఎప్పడూ ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. సాధారణంగా సినిమా హిట్ అయితే మూడు రోజులు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. వారాంతం తర్వాత తగ్గుతాయి. కానీ జెర్సీకి ఫీడ్ బ్యాక్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజు వచ్చే మెసేజ్‌లతో ఫోన్ నిండిపోతున్నాయి.

    రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నది

    రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నది

    మేము ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు, సన్నిహితులు జెర్సీ మూవీ గురించే మాట్లాడుతున్నారు. మాకు గొప్ప సినిమా అందించారని థ్యాంక్స్ చెబుతూ మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ఈ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశాం. మాపై విశేష ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు నాకు స్పెషల్ థ్యాంక్స్ అని నాని అన్నారు.

    రిపీట్ ఆడియెన్స్ వస్తారా అనే

    రిపీట్ ఆడియెన్స్ వస్తారా అనే

    జెర్సీ చాలా భావోద్వేగమైన సినిమా. ఒకసారి చూసిన తర్వాత మళ్లీ ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ రారేమో అని అనుకొన్నాం. కానీ మా ఆలోచనకు భిన్నంగా థియేటర్లకు ప్రేక్షకుల పొటేత్తుతున్నారు. ఈ సినిమాను మళ్లీ మహళీ చూసి ఫీలవుతూ పంపుతున్న మెసేజ్‌లు.. లవ్ లెటర్ల మాదిరిగా ఉన్నాయి.

     గెస్ట్‌గా రానాను ఎందుకు పిలిచానంటే

    గెస్ట్‌గా రానాను ఎందుకు పిలిచానంటే

    జెర్సీ థ్యాంక్యూ మీట్‌కు రానాను గెస్ట్‌గా పిలువడానికి కారణం ఉంది. సినిమా చూసి నాకు ఫోన్ చేసినప్పుడు దాదాపు ఏడ్చేసే పరిస్థితి కనిపించింది. రానాకు అంతగా ఈ సినిమా నచ్చింది. సినిమా చూసిన తర్వాత నన్ను కలిసి గంట సేపు నాతో మాట్లాడాడు. అందుకే ఈ సినిమా ఫంక్షన్‌కు పిలువాలని అనుకొన్నాను.

     ఎలాగైనా వస్తాడని నాకు నమ్మకం

    ఎలాగైనా వస్తాడని నాకు నమ్మకం

    రానాను ఈ రోజు మధ్యాహ్నం వరకు నేను ఫోన్ చేసి ఫంక్షన్‌కు రమ్మనలేదు. నా మేనేజర్ రానాకు ఫోన్ చేశావా అని అడిగితే.. లేదు.. లాస్ట్ మినిట్‌లో చేసినా వస్తాడనే ధీమా ఉంది. అందుకే చివరి నిమిషంలో ఫోన్ చేశాను. ఎందుకంటే ఈ సినిమా అంతగా నచ్చింది.. ఎలాగైనా వస్తాడని నా కాన్ఫిడెన్స్ అని నాని అన్నారు.

    జెర్సీ పాతపడదని నాని ఎమోషనల్

    జెర్సీ పాతపడదని నాని ఎమోషనల్

    మా కెరీర్‌ ముగియ వచ్చు. మేమంత పాత పడి పోవచ్చు. కానీ జెర్సీ మాత్రం ఎప్పటికీ పాత పడదు. టీమ్ అందరికి జెర్సీ స్పెషల్ మూవీగా, గొప్పగా గర్వంగా చూపించే చిత్రంగా జెర్సీ నిలుస్తుంది. మమల్ని ప్రోత్సహించిన మీడియాకు, డిస్టిబ్యూటర్లకు నా థ్యాంక్స్ అని నాని ఎమోషనల్‌గా మాట్లాడారు.

    English summary
    Natural Star Nani's latest movie is Jersey. First Single from #JERSEY will release on 14th February! Directed by Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi under Sithara Entertainments. An Anirudh Musical!. This film set to release on April 19th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X