అఖిల్ సినిమా ఆలస్యమవుతోంది అందుకే!
భారీ అంచనాలతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. తొలి చిత్రం నుంచి అఖిల్ పరాజయాలు వెంటాడుతున్నాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం మరోమారు వాయిదా పడ్డట్లు అయింది. ఈ సారి అఖిల్ మంచి కథని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో అతడు ప్లాపుల్లో ఉన్నా అఖిల్ ఒకే చేశాడట.
అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో చిత్రం గురించి గత రెండు నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు. చిత్ర ప్రారంభం ఆలస్యం కావడానికి ఇదే కారణం అని అంటున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని సిద్ధం చేశారట. కథకు సరిపడే హీరోయిన్ కోసం భాస్కర్ వెతుకునట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఒకే కాగానే అధికారిక ప్రకటన చేస్తారట. నాల్గవ చిత్రంతో అయినా విజయాల ఖాతా తెరవాలని అఖిల్ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











