హైదరాబాద్‌కి నాగచైతన్య గుడ్‌బై.. ఇక అక్కడికే మకాం!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడో తరం నటుడు అక్కినేని నాగచైతన్య. తాత, తండ్రి బాటలోనే రోమాంటిక్ స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్నాడు. కానీ ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోలేదు.. ఘనమైన కుటుంబ వారసత్వం ఎంట్రీ వరకే పనికొచ్చింది. ఆపైన నిరూపించుకోవాల్సింది తానేనని నాగచైతన్య ముందే గ్రహించాడు. తొలి సినిమా జోష్ ఫర్వాలేదు అనిపించుకున్నా.. ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ దశలో విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేసావెతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు చైతూ. ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్‌తో మరో విజయాన్ని అందుకున్నారు .

ఈ వరుస హిట్లతో నాగచైతన్య రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఈ జోష్‌ను ఆయన కొనసాగించలేకపోయారు. దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా, దోచేయ్, సవ్యసాచి, సాహసమే శ్వాసగా సాగిపో, శైలజారెడ్డి అల్లుడు ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. మాస్ ఫాలోయింగ్‌ కోసం ట్రై చేసి చైతూ చేతులు కాల్చుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అధైర్యపడకుండా తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీస్‌తోనే మరోసారి హిట్ బాట పట్టాడు చైతన్య. ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీ మామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు, థ్యాంక్యూ వంటి హిట్‌లతో రేసులో నిలబడ్డారు .

Hero akkineni naga Chaitanya made sensational comments on retirement life

అయితే వ్యక్తిగత జీవితంలో నాగచైతన్య ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఏమాయ చేసావెలో తనకు జోడీగా నటించిన సమంతని పెళ్లి చేసుకున్న చైతూ.. రెండేళ్ల క్రితం ఆమె నుంచి విడిపోయారు. కుటుంబంతో దూరంగా , ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే చైతన్య ఓ చిన్న ఫ్లాట్‌లో గడుపుతుంటారు. సినిమాలు, షూటింగ్‌లలో తన పని తాను చేసుకుపోతూ.. ఖాళీ సమయాల్లో తనకు ఇష్టమైన కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడాన్ని చైతూ ఏంజాయ్ చేస్తుంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ వివాదంలోనూ ఆయన తలదూర్చలేదు.

ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్వకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా పాకిస్తాన్‌ బలగాలకు చిక్కడం, అక్కడి జైళ్లలో ఇబ్బందులు , తిరిగి విడుదల కావడం ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తండేల్ మూవీ తన కెరీర్‌లోనే సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని చైతూ సైతం ధీమాగా ఉన్నారు. మత్స్యకారుడి పాత్ర కోసం చైతూ పూర్తిగా మేకోవర్ అయ్యారు. వారి వేష బాషలు , బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడం కోసం శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో గడిపారు చైతన్య.

Hero akkineni naga Chaitanya made sensational comments on retirement life

చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలు తనకు ఇష్టమైన ప్రదేశాలని ఎన్నోసార్లు చెప్పిన ఆయన.. రిటైర్ అయ్యాక మాత్రం గోవాలో సెటిలైపోతానని అంటున్నారు. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా గోవా తనకు చాలా స్పెషల్ అని ఆయన చెప్పారు. తనకు 45 ఏళ్లు వచ్చేసరికి గోవాకి షిప్ట్ అయి.. ఏడాదికి ఒక సినిమా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నానని నాగచైతన్య ఓ సందర్భంలో అన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు మీరు గోవాకు ఎందుకు సార్ అని నెటిజన్లు చైతన్యను సరదాగా ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X