మా అమ్మ అలాంటిది... అందుకే నా లైఫ్ ఇలా అయిపోయింది: షాకింగ్ విషయాలు బయటపెట్టిన నాగచైతన్య

హీరో నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎంత బిడియంగా ఉంటారో అంతే డిసిప్లెన్, టైం సెన్స్ తో ఉంటారు. ఇక చైతూ ప్రస్తుతం తండేల్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వాళ్ల అమ్మ గురించి, రామానాయుడు, ఏఎన్నార్ గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. ఆయన లైఫ్ అలా అయిపోవడానికి కారణం అదే అంటూ తెలిపారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

అక్కినేని వారసుడు నాగచైతన్య... సమంతతో విడాకుల తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇక ఈ జంట ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. నాగచైతన్య.. తన తల్లి గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన గురించి, తన లైఫ్ పర్సనల్ విషయాలు వెల్లడించారు.

Hero Akkineni Naga Chaitanya Shocking Comments on His Mother And Father Nagarjuna Full Details Here

గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పాల్గొనగా.. మీకు డిసిప్లెన్, టైం సెన్స్ ఎవరు నేర్పించారు అనగా.. అందులో చైతూ మాట్లాడుతూ... ఇది నేర్చుకుంది మేం తాతగారి నుంచి నేర్చుకున్నాం. క్రమశిక్షణ, టైం సెన్స్ అనేది రామానాయుడు గారు, ఏఎన్నార్ గారు ఇద్దరు టైం సెన్స్ నేర్పించారు. ఒక మనిషి పలానా టైం చెప్పారంటే.. ఆ సమయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్లు కూడా ఎన్నో పనులు వదులుకుని వస్తుంటారు. అలాంటప్పుడు వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటూ చెప్పుకువచ్చాడు.

డౌన్ టు ఎర్త్ అనేది అమ్మ లేదా నాన్న ఎవరు నేర్పించారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చైతూ. అందులో నాగచైతన్య మాట్లాడుతూ... ఇక తన అమ్మ గురించి మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు అంతా అమ్మ దగ్గరే పెరిగాను. 18 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మే నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎతిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నేర్పించారు.

మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.. లేదు అని చైతూ చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ. బాగా కంఫార్ట్ ఉన్నవాళ్లతో ఓపెన్ అప్ అవుతాను. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు..ఒక 20, 30 మంది ఫ్రెండ్స్ వద్దు. రోజుకు ఇద్దరు ముగ్గురిని కలవడం నాకు ఇష్టం ఉండదు. నలుగురు, ఐదుగురు ఉంటే చాలు.. నిజాయితీగా ఉండే వాళ్లు చాలు. నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అది చాలు అంటూ చెప్పుకువచ్చారు.

ఇక చైతూ మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చైతూ మనసు గొప్పదని.. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తుంది. చందు మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. అల్లు అరవింద్ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X