అమలపై ఎంత ప్రేమ చూపించినా.. నాగార్జునకు నచ్చిన ఆ పని మాత్రం అస్సలే చేయదట.. ఏంటంటే?

టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోహీరోయిన్లు, లవ్లీ కపుల్ అయిన అక్కినేని నాగార్జున, అమల గురించి అందరికీ తెలిసిందే. ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీళ్లు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇన్నేళ్ల వీరి ప్రేమ ప్రయాణం, పెళ్లి జీవితంలో కలహాలు పెద్దగా రాకపోయినా.. నాగార్జున అమలపై ఎంతో ప్రేమను కనబర్చినా.. ఆమె మాత్రం నాగార్జునకు నచ్చిన ఓ పనిని మాత్రం అస్సలే చేయదట. నాగార్జున కోసం ఏమైనా చేయగలిగే ఆమె.. ఒక్క విషయంలో మాత్రం తన ఇష్టాలను పట్టించుకోదట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జున తాజాగా నా సామి రంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ బాగానే వసూళ్లు రాబట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేయగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజునే హీరోహీరోయిన్లు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

 Hero Akkineni Nagarjuna Shocking Comments About Amala Check Details

తమ గురించి సినిమా గురించి అనేక విషయాలు చెబుతూ సందడి చేశారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగర్రాజు వంటి చిత్రాల లాగానే ఈ సినిమా కూడా చాలా బాగుందని అన్నారు. ఈ సారి సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల గురించి కూడా చెప్పుకు వచ్చారు. ముఖ్యంగా నాగార్జున అయితే తన భార్య అమల గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను చెప్పారు.

తాను అసలు డైటింగ్ యే చేయనని.. అన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తింటుంటానని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ విషయం విన్న ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసు కల్గిన ఈయన డైటింగ్ చేయకుండానే ఇంత అందంగా, యాక్టివ్ గా ఉన్నాడంటే నమ్మడం కష్టమే మరి. కానీ ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే మీకు ఏయే వంటకాలు అంటే ఇష్టం అని యాంకర్ అడగ్గా.. ఓ లిస్టును చెప్పాడు. ఆ తర్వాత అమల గారు చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం, మీకు నచ్చిన వంటకాలను ఆమె ఎప్పుడెప్పుడు చేసి పెడతారని ప్రశ్నించారు.

 Hero Akkineni Nagarjuna Shocking Comments About Amala Check Details

అయితే ఈ ప్రశ్న వినగానే నాగార్జున గట్టిగా నవ్వేశారు. అమల అసలు ఎక్కువగా వంటే చేయదని... ముఖ్యంగా తనకు నచ్చిన వంటకాలను అస్సలే వండదని వివరించారు. తనకు నాన్ వెజ్ అంటే ఇష్టం అని, అమల మాత్రం నాన్ వెజ్ ను అసలు టచ్ కూడా చేయదని.. అందుకే తనకు నచ్చిన వంటకాలను అమల వండలేకపోతుందని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X