నాంది హిట్టుతో అల్లరి నరేష్ కు భారీ ఆఫర్స్.. ఆ దర్శకుడితో మరోసారి
టాలీవుడ్ బెస్ట్ కామెడీ హీరోల్లో ఒకరైన అల్లరి నరేష్ మొత్తానికి నాంది సినిమాతో 8 ఏళ్ళ అపజయాలకు బ్రేక్ వేశాడు. నాంది సక్సెస్ నరేష్ కు మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా ప్రయోగాత్మకమైన కథలలో కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తారని రుజువు చేసింది. ఇక నరేష్ ఈ సక్సెస్ తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.
ఎలాగైనా మరో సక్సెస్ తో తన మార్కెట్ ను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే దిల్ రాజుతో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. కథ దొరకడమే ఆలస్యం. దిల్ రాజు కూడా నరేష్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే నరేష్ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతోనే ఉంటుందట.

హరీష్ శంకర్ శిష్యుడైన విజయ్ మొదటి సినిమాతోనే ప్రయోగాత్మకమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక అతనికి ఆఫర్స్ చాలానే వస్తున్నప్పటికీ నరేష్ తోనే మరో సినిమా చేసి హిట్టు కొట్టాలని అనుకుంటున్నారు. మరి నాంది లాంటి థ్రిల్లర్ సినిమా అనంతరం వీరి కాంబోలో రాబోయే సినిమా ఏ జానర్ లో ఉంటుందో చూడాలి. అలాగే నరేష్ రెండు కామెడీ సినిమాలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











