Naresh : ఆ హీరోయిన్‌తో నరేశ్‌కు ఎఫైర్... అసలు విషయం బయటపెట్టిన హీరో
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ రూమర్స్ వస్తుంటాయి. హీరో హీరోయిన్, ప్రోడ్యూసర్ హీరోయిన్, డైరెక్టర్ హీరోయిన్.. ఇలా చాలా గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అయితే హీరో నరేష్ కు కూడా ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో తన ఎపైర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. అసలు విషయం చెప్పి షాకిచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
నరేష్ కు ఎఫైర్...
అల్లరి నరేష్.. అల్లరి సినిమాతో వచ్చి నవ్విస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన రూటు మార్చి అప్పుడుప్పుడు ఎమోషనల్ కూడా చేస్తున్నాడు. ఇక ప్రయోగాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ కామెడీ సినిమాతో త్వరలో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. అల్లరి నరేష్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిపై హీరో నరేష్ ఓ ఇంటర్వ్వలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అర్థం చేసుకునే వాళ్లు వస్తే...
కితకితలు చేసే సమయంలో నిజంగా అలాంటి వైఫ్ వస్తే ఎలా అని చాలా మంది అడిగారు. నేను రెండే చెప్పాను.. అందం, డబ్బు ఎప్పుడు మనవద్దే ఉంటుందని అనుకోవద్దని చెప్పాను. వాటికి కొలబద్ద అనేది ఉండదు. మనకు వచ్చే వాళ్లు వారి ఫ్రొపెషనల్ అర్థం చేసుకోవాలి.. అలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందని చెప్పుకువచ్చారు. మనల్ని అర్థం చేసుకునేవారు వస్తే జీవితం బాగుంటుందని తెలిపారు నరేష్.
హీరోయిన్ ఫర్జానాతో...
ఓ హీరోయిన్ తో పెళ్లి వరకు వచ్చారనే వార్తలు వస్తున్నాయి అని ఇంటర్వ్యూ చేసే వాళ్లు అడగ్గా... దానికి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాంటిది ఏమి లేదు.. నాన్నకు కూడా చెప్పేవాడిని.. అప్పుడు దానికి నాన్న.. అవునా నా కోడలిని పరిచయం లేదని అని ఫన్నీగా అనేవారు.. చాలా మంది రకరకాలుగా అనుకునేవారు. ఆ అమ్మాయి ఫర్జానా.. నా సినిమాల్లో నటించింది కానీ అలాంటిది ఏమిలేదని చెప్పుకువచ్చారు.

అసలు విషయం చెప్పి...
అందరూ హీరోయిన్లు అమ్మలు, లేదా నాన్నలతో వస్తారు. కానీ ఆమె మాత్రం బాయ్ ఫ్రెండుతో వచ్చింది. ఎప్పుడు పక్కనే ఉండేవాడు. మాకు ఎఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.. నువ్వైనా చెప్పురా అంటే.. ఓ అవునా అనేవాడు.. నవ్వేవాడు... అని నరేష్ చెప్పుకువచ్చాడు. చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు. కానీ అలాంటిది ఏమి లేదు.. అని క్లారిటీ ఇచ్చాడు నరేష్. గతంలో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హిట్ కొట్టేందుకు...
నరేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆ ఒక్కటి అడక్కు సినిమాతో బిజీగా ఉన్నాడు నరేష్. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంది. పెళ్లి కాని ప్రసాదుల మీద సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 30 ఏళ్లు దాటినా నరేష్ కు ఇంకా పెళ్లి కాదు. దీంతో పెళ్లి కాకపోవడం అనేది పాన్ ఇండియా ప్రాబ్లం అన్నట్లు చూపించారు. తొలిసారి ఈ సినిమాలో నరేష్ సరసన జాతిరత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











