Dhanush: నేను కామెడీగా చేశా.. అదే శాపంగా మారింది

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఆయనకు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 'రఘువరన్ బీటెక్' సినిమాతో ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో అసాధారణమైన క్రేజ్ తీసుకువచ్చింది. తన సహజ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు ధనుష్‌కు జాతీయ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ధనుష్ ఏ సినిమా చేసినా, అది తప్పకుండా తెలుగులో రిలీజ్ కావాల్సిందే. అలాంటి స్టార్ డమ్ సంపాదించకున్న హీరో తాను కామెడీగా చేసిన ఓ పని.. తనకు వరంగానూ.. అదే పని శాపం గాను మారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ధనుష్ హీరోగా నటించిన 'త్రీ' సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో'కొలవెరి డి' (Kolaveri d) పాట మాత్రం వైరల్ గా మారి ఇండస్ట్రీని షేక్ చేసింది. ధనుష్ పాడిన ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగానే దేశమంతా కొల వెర్రి పట్టుకుంది. సాదాసీదా ట్యూన్, టాంగ్లిష్ లిరిక్స్‌తో రూపొందిన ఈ పాటకు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా లభించింది. ఇప్పటికి 560 మిలియన్ వ్యూ‌లు దాటుతూ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటపై అనేక పేరడీలు, రీమిక్స్‌లు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని కుదిపేసిన వైరల్ సాంగ్ 'వై దిస్ కొలవేరి డీ' గురించి హీరో ధనుష్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Hero Dhanush Reveals the Untold Story Behind the Viral Hit Why This Kolaveri Di

ఇటీవల దుబాయ్ వాచ్ వీక్‌లో పాల్గొన్న హీరో-దర్శకుడు ధనుష్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన 'వై దిస్ కొలవెరి' పాట ఎలా పుట్టింది? ఎలా ప్రపంచ హిట్ అయ్యింది? అనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.హీరో ధనుష్ మాట్లాడుతూ, "ఈ పాటను అసలు కామెడిగా చేశాం. ఓ సారి సరదాగా ఈ పాట చేసి వదిలేశాం. పూర్తిగా మర్చిపోయాం కూడా. మరో పాటల పనుల్లో బిజీ అయ్యాం. ఒక రోజు తిరిగి ఓపెన్ చేసి వినగానే నవ్వేసుకున్నాం" అని వెల్లడించాడు.

హీరో ధనుష్ మాట్లాడుతూ.. 'ఒక రోజు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్‌ (Anirudh Ravichander)కు సిస్టమ్‌లో ఈ పాట కనిపించింది. మళ్లీ విన్నాం... ఫన్నీగా ఉంది. ఫన్ ఉన్నదంటే పనిచేస్తుంది, కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. మా ఆశ మాత్రం చిన్న రీజినల్ హిట్, కానీ ఇది వైరల్ మార్కెట్‌నే రీడిఫైన్ చేసింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టింది " అని అన్నారు.

"మా భాష తమిళం ప్రపంచంలోనే పాత భాషల్లో ఒకటి. కానీ ఈ పాట మాత్రం నిజమైన తమిళంలో కాదు... టాంగ్లిష్‌లో వచ్చింది. ఈ పాట నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తుంటా... కానీ అది నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది" అని చిరునవ్వుతో ధనుష్ చెప్పాడు. ఈ పాట వైరల్ అయిన తీరు తనకే ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నాడు. "ఇది వైరల్ మార్కెటింగ్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. నాకు గర్వంగా ఉంది. కానీ ఇది ఆశీర్వాదం కూడా... శాపం కూడా" అంటూ ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X