Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీకాంత్ కంటే ఖరీదైన ఇంటి నిర్మాణం.. భారీ ఖర్చుతో లగ్జరి ఇల్లును ప్లాన్ చేస్తున్న ధనుష్
సినిమా ప్రపంచంలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రానా అవకాశాలు ఈజీగా వస్తాయి గాని ప్రతిసారి విజయాలు మాత్రం రావు. ఇక రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా మొదట అలాంటి పరిస్థితినే చూశాడు. మొదట్లో అతను హీరో ఏంటని హేళన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆదాయంలో అతను అగ్ర హీరోలను కూడా డామినేట్ చేశాడు. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మిస్తుండడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.
రెమ్యునరేషన్ తగ్గించి..
హీరో ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ డిఫరెంట్ గా హైలెట్ అయ్యేలా ఉంటుంది. వీలైనంత వరకు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే ధనుష్ కెరీర్ మొదటి నుంచి కూడా సినిమాల విషయంలో చాలా విబిన్నంగా ఆలోకేబిస్తుంటాడు. అవసరం అయితే మంచి కథల కోసం రెమ్యునరేషన్ ను కూడా తగ్గిస్తుంటాడు.
నిర్మాతలు దొరక్కపోతే
డబ్బుపై పెద్దగా వ్యామోహం లేకపోవడం వల్లనో ఏమో గాని.. ధనుష్ ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అతనికి రెమ్యునరేషన్ ను చూసి ఏనాడు సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. ఇక ప్రస్తుతం 15కోట్లకు పైగా అతని పారితోషికం నడుస్తున్నట్లు సమాచారం. కథలు బావుండి దర్శకుడికి నిర్మాతలు దొరక్కపోతే కూడా ధనుష్ చాలా సందర్బాల్లో తన సొంత బ్యానర్ లోనే సినిమాలు నిర్మించాడు.
హాజరైన రజనీకాంత్
ఇక ధనుష్ చాలా రోజుల అనంతరం తన కలల ఇంటిని నిర్మికచుకుంటున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కాస్ట్లీ ఏరియా అయినటువంటి పోయెస్ గార్డెన్ లో 19వేల ఎస్ఎఫ్టీ స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భూమి పూజ కూడా చేయగా ఆ కార్యక్రమానికి రజనీకాంత్ కూడా హాజరయ్యారు.
మొత్తం ఖర్చు ఎంతంటే
ఇక ధనుష్ తన ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 150కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ వద్ద వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఏమి ఆశించకుండా తను సంపాదించిన సొంత డబ్బుతోనే ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు, ధనుష్ కొన్ని బిజినెస్ లలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ భారీ ఆదాయాన్ని వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రెమ్యునరేషన్..
ఇక ధనుష్ తదుపరి సినిమాల లైనప్ చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా భారీగా తెరకెక్కుతున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే ఒక హాలీవుడ్ సినిమా మొదలవ్వగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా కోసం దాదాపు 30కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.