Don't Miss!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజస్థాన్‌లో హీరో గోపిచంద్‌కు ప్రమాదం.. ఎలా.. ఏం జరిగిందంటే!
Recommended Video
టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. తాను నటిస్తున్నా తాజా షూటింగ్లో చోటుచేసుకొన్న ప్రమాదంలో గోపిచంద్‌కు స్వల్పగాయాలయ్యాయి. చిత్ర యూనిట్, ఫైట్ మాస్టర్లు సకాలంలో స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయిందని తెలిసింది. వివరాలల్లోకి వెళితే..
జైపూర్‌లో యాక్షన్ సన్నివేశాలు
ప్రస్తుతం గోపిచందర్ హీరోగా దర్శకుడు తిరు దర్శకత్వంలో నిర్మాత అనిల్ సుంకర ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని మాండవలో చిత్రీకరణ జరుపుకొంటున్నది. ఈ షూటింగ్లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రమాదం చోటుచేసుకొన్నది.
బైక్ అదుపు తప్పడంతో
హీరో గోపిచంద్పై బైక్‌తో ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. షూటింగ్ జరుగుతున్న సమయంలో బైక్ అదుపు తప్పడంతో గోపిచంద్ కిందపడిపోయాడని, స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్సను వైద్యులు చేశారు. అనంతరం గోపిచంద్‌ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
స్థానిక హాస్పిటల్లో చికిత్స
బైక్ అదుపు తప్పడం వల్ల గోపిచంద్‌కు గాయాలయ్యాయి. స్థానిక ఫోర్టీస్ హాస్పిటల్స్‌లో ప్రాథమిక చికిత్స జరిగింది. ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు. గాయాలకు ట్రీట్మెంట్ చేశారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకొన్న తర్వాత షూటింగ్ జరుపుకోవచ్చని ఫోర్టీస్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
పంతం మూవీ హిట్ తర్వాత
ఇటీవల కాలంలొ గోపిచంద్ చిత్రాలు పెద్దగా సక్సెస్ సాధించిన దాఖలాలు లేవు. ఆయన నటించిన పంతం చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. ఈ క్రమంలో కాస్త బ్రేక్ తీసుకొని భారీ హిట్ సాధించేందుకు గోపిచంద్ ప్రయత్నిస్తున్నాడు. నిర్మాత అనిల్ సుంకర చిత్రంపై చాలా ఆశలు పెట్టుకొన్నారు.