సినీ కార్మికులకు అండగా.. సీసీసీకి గోపిచంద్ విరాళం

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్థంభించిపోతోంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది పేదలు, తిండి లేక అల్లాడిపోతోన్నారు. ఉపాధి కోల్పోడంతో దిక్కులేని స్థితిలో పడ్డారు.

వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు సెలెబ్రిటీలు ముందుక వస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు ఇప్పటికే ఓ ప్రత్యేక ఛారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Hero Gopichand Donates 10 Lakhs To CCC

కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చి ఛారిటీని ఏర్పాటు చేసిన చిరంజీవి.. తోటీ నటీనటులను కూడా సాయం చేయాల్సింది అర్థించాడు. ఈ మేరకు హీరోలంతా తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించారు. తాజాగా హీరో గోపీచంద్ కూడా తన వంతుగా ఆర్థిక సాయాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఇప్పటికే గోపీచంద్ దాదాపు వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అలా వెయ్యి మంది నిరుపేద కుటుంబాల ఆకలిని తీర్చేశాడు. నెల రోజులకు సరిపడ చిల్లర సామానును కొనుగోలు చేసి వెయ్యి కుటుంబాలకు పంపిణీ చేశాడు. తాజాగా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించాడు. రోజూ 1500 మంది అనాథ‌ల‌కు రెండు నెల‌ల పాటు అన్న‌దానం చేస్తున్నాడు. గోపీచంద్ పెద్ద మనసుకు అంతా ఫిదా అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X