twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెయ్యి కుటుంబాలకు అండగా.. గోపీచంద్ రియల్ హీరో

    |

    కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు సినీ తారలంతా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా వైరస్.. భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసే భాగంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

    ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని, రోడ్లపైకి రాకూడదని ప్రధాని సూచించడంతో.. పేదలు, కూలీల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. వీరిని ఆదుకునేందుకు దాతలు ముందుక వస్తున్నారు.

    Hero Gopichand Helped for 1000 Poor Families

    పేదలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. చిత్ర పరిశ్రమ మూత పడటం, షూటింగ్స్ లేకపోవడంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటగా తాను కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చిన చిరు.. తోటీ హీరోలకు కూడా పిలుపునిచ్చాడు. ఈ మేరకు విరాళాలు వెల్లువల వచ్చాయి.

    అయితే కొంత మంది హీరోలు ఆర్థికంగా కాకుండా.. వస్తు రూపంలో చేస్తున్నారు. అందులో గోపీచంద్ చేస్తున్న సాయానికి అందరూ సలామ్ చేస్తున్నారు. వెయ్యి మంది నిరుపేద కుటుంబాల ఆకలిని తీర్చేశాడు. నెల రోజులకు సరిపడ చిల్లర సామానును కొనుగోలు చేసి వెయ్యి కుటుంబాలకు పంపిణీ చేశాడు. ఈ మేరకు గోపీచంద్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Hero Gopichand Helped for 1000 Poor Families. He Distributed Daily Need Groceries To thousand Needy Families In Crisis Of Lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X