సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో మరో బిగ్ మూవీ స్టార్ట్ చేసిన గోపిచంద్.. హ్యాట్రిక్ కాంబినేషన్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా యువ హీరోలు స్టార్ హీరోలు అందరూ కూడా చాలా వేగంగా సినిమాలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ కూడా వెంటవెంటనే కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకు వస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ హీరోకు సరైన విజయాలు దక్కలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాడు. చివరగా సిటిమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ కరోనా కష్టకాలంలో వీకెండ్ అనంతరం సినిమాకు ఊహించని విధంగా దెబ్బ పడింది. ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గిపోవడంతో మళ్లీ గోపీచంద్ సినిమాను ఎప్పటిలానే నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే ఈ సారి మాత్రం తప్పకుండా సక్సెస్ అందుకోవాలని సక్సెస్ఫుల్ దర్శకులను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు పక్కా కమర్షియల్ అనే టైటిల్ కూడా సెట్ చేసారు. తప్పకుండా ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని గోపీచంద్ ధీమాగా ఉన్నాడు. చాలా కాలంగా మారుతి వరుస కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అనుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు అదే టైటిల్ తోనే హిట్టు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

గోపీచంద్ మరో సక్సెస్ఫుల్ దర్శకుడితో సినిమాను మొదలు పెట్టాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు శ్రీవాస్. ఇదివరకే వీరి కాంబినేషన్లో కొన్నేళ్ళ క్రితం లక్ష్యం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాతోనే శ్రీనివాస్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తర్వాత వచ్చిన లౌక్యం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మూడవ సారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. నేడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇక దర్శకుడు శ్రీవాస్ కూడా చాలా కాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నాడు.
అతను చివరగా డైరెక్ట్ చేసిన సాక్ష్యం సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఇక చాలా రోజులుగా ఒక ఫ్యామిలీ యాక్షన్ పై కూర్చున్న ఈ దర్శకుడు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే గోపీచంద్తో చెప్పాడట గోపీచంద్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మై హీరో గోపీచంద్ ఈసారైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. త్వరలోనే రెగ్యులర్ సినిమా షూటింగ్ ప్రారంభించి మిగతా నటీనటుల వివరాలను కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయనున్నారు.


Click it and Unblock the Notifications











