Jagapathi Babu: జగ్గూ భాయ్‌ను హాలీవుడ్ పిలుస్తోందట.. ఏమంటారంటున్న హీరో!

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో జగపతి బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగానే సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ ఈయన టాలెంట్ తో అదరగొట్టారు. ముఖ్యంగా అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించి సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాధించుకున్నాడు.

గతంలో హీరోగా సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు కొట్టిన ఆయన... దాదాపుగా వందకు పైగా చిత్రాల్లో నటించారు. మొత్తం ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం విలన్ గా కూడా ఇరగదీస్తూ.. సూపర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న జగ్గూ భాయ్.. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాడు. హీరోగా చేస్తే వచ్చిన క్రేజ్ కంటే కూడా విలన్ గా చేసి మరింత పేరు ప్రఖ్యాతలను పొందాడు.

Hero Jagapathi Babu Comments About Hollywood Calling Post Goes Viral

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు జగపతి బాబు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తూ ఉంటారు. అలాగే తన ట్రెండీ ట్రెండీ లుక్స్ ను కూడా చూపిస్తూ అలరిస్తారు. ఈక్రమంలోనే ఆయన కాసేపటి క్రితమే ఓ విషయాన్ని వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేశారు. తనను హాలీవుడ్ పిలుస్తుందని వివరించారు. వెళ్లమంటారా, వద్దు అంటూరా అనే అర్థం వచ్చేలా మీరేమంటారు అంటూ జగ్గు భాయ్ పోస్ట్ పెట్టారు.

జగపతి బాబు రాసుకొచ్చిన ఈ మ్యాటర్ తో పాటు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని స్టైలిష్ లుక్ లో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో బ్లాక్ కలర్ క్యాప్, బ్లాక్ గాగుల్స్, ప్యూర్ బ్లాక్ సూటు వేసుకొని స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. జగ్గూ భాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హో గుడ్ వెళ్లండి సార్ అంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మీ అద్భుతమైన నటన కేవంల టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకూడదని.. ప్రపంచ వ్యాప్తంగా మీ ఖ్యాతి వెలుగొందాలంటూ ఆయన అభిమానులు రాసుకొస్తున్నారు.

Hero Jagapathi Babu Comments About Hollywood Calling Post Goes Viral

ఇదంతా ఇలా ఉండగా.. జగపతి ఇటీవల చేసిన చిత్రాలు అన్నీ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. కబ్జా, రామబాణం, రుద్రంగి వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్దగా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. కానీ రుద్రంగి చిత్రంలో జగపతి బాబు నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఆయన చెప్పిన డైలాగ్ లు అయితే ఫుల్ వైరల్ గా మారాయి. జగపతి బాబు కేవలం తెలుగులోనే కాకుండా హాలీవుడ్ కు కూడా వెళ్లి చిత్రాలు చేస్తే బాగుంటుందని మీకూ అనిపిస్తే ఓ కామెంట్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X