ఆ చిన్న సినిమా పాటకు ఎన్టీఆర్ ఫిదా.. ఫోన్ లో ఎక్కువగా అదే వింటాను అంటూ..
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న RRR సినిమా కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్యాప్ లేకుండా లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. చిత్ర దర్శకుడు రాజమౌళి భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని ప్రతి ఇండస్ట్రీలోకి తీసుకు వెళ్లి అక్కడ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా చేయిస్తున్నారు. వీలైనంత వరకు హీరోల ఇద్దరిని ఆడియెన్స్ కు దగ్గరగా తీసుకెళ్లే విధంగా పలు ముఖ్యమైన ప్రదేశాలకు కూడా తీసుకువెళుతున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి కి సంబంధించిన అనేక రకాల విషయాలను కూడా ఇంటర్వ్యూలో సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి కూడా తారక్ చాలా విషయాలు చెబుతున్నడు. ఒక విధంగా మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా దగ్గరవుతున్నడు. ఇక రీసెంట్ గా మలయాళంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
మీ ఫోన్ లో నిత్యం ఎక్కువసార్లు వినే పాట ఏది అనే ప్రశ్న అడిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న సినిమాకు సంబంధించిన పాట గురించి చెప్పడం విశేషం. ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కేరాఫ్ కంచరపాలెం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలోని ఆశ పాశం అనే పాట కూడా జనాలను ఎంతో ఆకట్టుకుంది. జీవితంలోని ఎన్నో అంశాలను తెలిపే ఆ పాట ఎంతో మంది ప్రముఖులు నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఆ పాట తనకు చాలా ఇష్టమని ఫోన్ లో ఎక్కువగా అదే వింటూ ఉంటాను అని చెప్పాడు.

అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఆ పాటను ఆ ఇంటర్వ్యూలో పాడి వినిపించే ప్రయత్నం చేశాడు. ప్రతి ఇంటర్వ్యూ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో చాలా సింప్లిసిటీని చూపిస్తున్నాడు. సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఎంత సరదాగా ఉంటారో అంత ఓపెన్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. పెద్దగా హంగూ ఆర్భాటం లేకుండా ఓపెన్ గా అందరూ ఎంజాయ్ చేసే తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి విషయాన్ని చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాడు అని అర్థమవుతోంది.
ఇక సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ రెగ్యులర్ గా ఫాలో అవుతాడని.. ప్రస్తుతం ఇస్తున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే అని అర్థమవుతోంది. ఇక రాజమౌళికి సరదాగా కౌంటర్స్ ఇస్తున్న విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ తో పాటు తన కెరీర్ కూడా మరొక లెవెల్ కి వెళుతుంది అని, RRR ముందు RRT తర్వాత అనే విధంగా తమ కెరీర్ ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ హీరోలకు ఎలాంటి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











