twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ అవార్డుల్లో కోలీవుడ్, టాలీవుడ్.. హీరో కార్తీ ప్రశంసలు

    |

    సినీ రంగానికి సంబంధించిన 67వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో దక్షిణాది అన్ని భాషల చిత్రాలు సత్తాను చాటాయి. తమిళ, తెలుగు, మళయాల చిత్రాలు అవార్డు పంటను పండించాయి. తెలుగులో జెర్సీ, మహర్షి, తమిళంలో అసురన్, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలకు అవార్డులు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా హీరో కార్తీ స్పందించాడు.

    తమిళంలో అసురన్ సినిమాకు సంబంధించిన ఉత్తమ నటుడిగా ధనుష్ ఎంపికయ్యాడు. సూపర్ డీలక్స్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటుడిగా విజయ్ సేతుపతికి అవార్డులు లభించాయి. వీటిపై కార్తీ స్పందిస్తూ.. అసురన్ యూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపాడు. బయటకు బాధను చెప్పుకోలేని అటువంటి వారి పాత్రను పోషించడం అంత సులభమైన పని కాదని విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపించాడు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇమ్మాన్‌కు అవార్డ్‌ రావడం సంతోషంగా ఉందన్నాడు. ఆయన తన సంగీతం ప్రతీ సీన్‌ను ఎలివేట్ చేస్తారని అన్నాడు.

    Hero Karthi ABout 67th national award winning movies

    ఇక మహర్షి సినిమా గురించి మాట్లాడుతూ.. ఊపిరి నాటి రోజులను కార్తీ గుర్తుకు చేసుకున్నాడు. ప్రతీ సీన్ గురించి నువ్ ఎంత కష్టపడతావో నాకు తెలుసంటూ కంగ్రాట్స్ తెలిపాడు కార్తీ. మహర్షి యూనిట్‌కు కంగ్రాట్స్. జెర్సీ లాంటి మంచి చిత్రానికి సరైన గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్ అని కార్తీ తెలిపాడు. కార్తీ ప్రస్తుతం సుల్తాన్ సినిమాతో అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యాడు.

    English summary
    Hero Karthi ABout 67th national award winning movies,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X