Karthi: నవంబర్ 10న ఆ పని చేయకోపోతే సీటు కింద బాంబ్ పెడతా.. హీరో కార్తి మాస్ వార్నింగ్!

హీరో కార్తి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను తమిళ హీరోనే అయినా తెలుగు హీరోగానే భావిస్తూ.. ఇక్కడి వారు ఆరాధిస్తూ ఉంటారు. కార్తికి సంబంధించిన ఎలాంటి సినిమాను అయినా సరే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా చూస్తారు. సినిమా బాగుందని టాక్ వస్తే ఇక అంతే సంగతులు. థియేటర్లకు వెళ్లి మరీ సినిమాలను హిట్టు చేసేస్తుంటారు. అయితే కార్తి తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈక్రమంలోనే ఆయన తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.

జోకర్ సినిమా ఫేమ్ దర్శకుడు రాజు మురుగన్ డైరెక్షన్ లో కార్తి హీరోగా జపాన్ అనే సినిమాను తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకు.. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని నవంబర్ 10వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక, నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లు వచ్చారు. అలాగే వీరికి సపోర్ట్ చేసేందుకు న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

Hero Karthi Mass Warning to Audience in Japan Movie Pre Release Event

ఈ సందర్భంగానే హీరో కార్తి మాట్లాడుతూ.. చాలా డైలాగ్ లు కొట్టాడు. వాటికి అక్కడకు వచ్చిన ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ఆయన మాట తీరు చేసిన కామెంట్లకు ఖుషీ అయిపోయారు. అయితే ముఖ్యంగా నెట్టింట ఫుల్ వైరల్ అయిన.. యుగానికి ఒక్కడు సినిమాలోని ఎవర్రా మీరంతా డైలాగ్ ను కొట్టాడు. దానికి అంతా క్లాప్స్ కొట్టారు. అలాగే జపాన్ సినిమా గురించి చాలానే మాట్లాడారు. రాజు మురుగన్ తనకు జపాన్ సినిమా కథ చెప్పినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకు రావాలని బలంగా అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన మనసుకు ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుదంని వెల్లడించారు.

Hero Karthi Mass Warning to Audience in Japan Movie Pre Release Event

అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ చివర్లో కార్తి కొట్టిన డైలాగ్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది. జపాన్ స్టయిల్లో అందరికీ ఓ మాట చెబుతున్నానంటూ ప్రారంభించి.. నవంబర్ 10వ తేదీన ఈ సినిమా వస్తుంది. మీరంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడకపోతే సీట్ల కింద బాంబులు పెడతానంటూ డైలాగ్ కొట్టాడు. దీనికి అంతా ఫిదా అయిపోయారు. ఫుల్లుగా నవ్వుకుంటూనే రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం కార్తి కొట్టిన ఈ డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Hero Karthi Mass Warning to Audience in Japan Movie Pre Release Event

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. కార్తిని చూసిన ప్రతీ ఒక్కరూ తెలుగు అబ్బాయనే అంటారని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులను కార్తి అంతగా సొంతం చేసుకున్నారని... ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తాడని వివరించారు. జపాన్ సినిమాలో మునుపెన్నడూ చూడని కోణంలో కనిపిస్తారని పేర్కొన్నారు. కార్తి తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అందుకే అతడి కోసం ఈ ఈవెంట్ కు వచ్చినట్లు చెప్పాడు. అలాగే ట్రైలర్ చూశానని.. తనకు చాలా బాగా నచ్చిందని అన్నాడు. జపాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని మనసారా కోరుకుంటున్నట్లు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X