వెండి తెరపై వైఎస్ జగన్‌గా తమిళ హీరో!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతోంది. యాత్ర పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకుడు. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యాత్ర చిత్రం తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ చరిత్ర ఆధారంగా తెరకెక్కించే చిత్రంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. జగన్ పాత్ర కోసం తమిళ హీరో కార్తీని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వైఎస్ జగన్, హీరో సూర్య కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ పాత్రలో కార్తీ నటించేందుకు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి యాత్ర చిత్రం సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.


Click it and Unblock the Notifications