ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్
ఒకప్పుడు హీరోలు తమ సినిమాల ఫలితాల గురించి బహిరంగంగా మాట్లాడేవారు కాదు. ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించేవారు కాదు.కానీ ఈ మధ్య ట్రెండ్ మారుతోంది. తమ డిజాస్టర్ సినిమాల గురించి సదరు హీరోలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. తమ మీద తామే సెటైర్లు వేసుకుంటున్నారు. తదుపరి ప్రాజెక్ట్‌తో అలరించేందుకు ప్రయత్నిస్తామని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు.
మొన్నా మధ్య నితిన్ కూడా కూడా తన చెక్ సినిమా ఫలితం మీద సెటైర్ వేశాడు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా తన సినిమా రిజల్ట్ గురించి చెప్పుకొచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన చావు కబురు చల్లగా చిత్రం చతికిలపడింది. అంచనాలు అందుకోలేక కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. పైగా సినిమా కాన్సెప్ట్ మీద కొందరు పెదవి విరిచారు. ఇదంతా ఒకెత్తు అయితే నటుడిగా కార్తికేయకు మంచి పేరును మాత్రం తెచ్చింది.

ఇదే విషయాన్ని తాజాగా కార్తికేయ చెప్పుకొచ్చాడు. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన చిత్రం చావు కబురు చల్లగా. ఇది చాలా మంది హృదయాలకు దగ్గర చేర్చింది. అయితే కొన్ని మెసెజ్‌లు చూశాక బస్తీ బాలరాజు పాత్రను పోషించడం గర్వంగా అనిపించింది. మూవీ నచ్చని వాళ్లందరూ కూడా చిన్న తప్పులను క్షమించేసి ఇంకొక చాన్స్ ఇవ్వండి.. వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటాను.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాను అని ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











