రాంచరణ్ ఒక్కడే కాదు.. మేము కూడా ఆయన పిల్లలమే. చిరంజీవిని కంటతడి పెట్టించిన కార్తీకేయ

RX 100 మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యువ హీరో కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, 90ml, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తన మార్కును ఎస్టాబ్లిష్ చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తాజాగా జీ టెలివిజన్ అవార్డుల ఫంక్షన్‌ వేదికపై కార్తీకేయ చేసిన డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా కార్తీకేయ స్పీచ్ కూడా మెగాస్టార్‌ చిరంజీవిని కదలించి కంటతడి పెట్టించింది. ఈ హృదయాన్ని టచ్ చేసిన సంఘటన గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

చిరంజీవి పాటకు డ్యాన్స్

చిరంజీవి పాటకు డ్యాన్స్

ఇటీవల హైదరాబాద్‌లో జీ టెలివిజన్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేదికపై యువ హీరో కార్తీకేయ మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని పదహారేళ్ల వయసు అనే పాటపై స్టెప్పులు వేశాడు. మంచి జోష్‌, లయబద్ధంగా పాటపై డ్యాన్స్ చేయడం సినీ స్టార్లను కూడా ఆకట్టుకొన్నది. ప్రేక్షకుల చేత విజిల్స్, చప్పట్లు కొట్టించింది. కార్తీకేయ తన స్పీడ్‌తో మెప్పించాడు.

చిరు, ఛార్మీ వావ్

చిరు, ఛార్మీ వావ్

లంకేశ్వరు సినిమాలోని పదహారేళ్ల వయసు పాటకు డ్యాన్స్ వేస్తున్న క్రమంలో చిరంజీవి, ఛార్మీ కూడా వావ్ అంటూ కనిపించారు. పాత మెమొరీస్‌ను గుర్తుకు రావడంతో చప్పట్లు కొడుతూ చిరంజీవి కొంత ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ఈ పాటను చాలా ఇంట్రెస్ట్‌గా చిరంజీవి వీక్షించడం కనిపించింది.

చరణ్ మాత్రమే కాదు.. మేము కూడా

చరణ్ మాత్రమే కాదు.. మేము కూడా

లంకేశ్వరుడు పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత హీరో కార్తీకేయ భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైన ప్రసంగిస్తూ.. 27 ఏళ్ల నా జీవితంలో ఇది నాకు బెస్ట్ మూమెంట్. మేమంత ఆయన పిల్లలం. చరణ్ గారు ఒక్కరే కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి కంట్లో నీళ్లు రావడంతో చేతి రూమాలతో తుడుచుకోవడం కనిపించింది.

 చిరంజీవి కాళ్లకు మొక్కి

చిరంజీవి కాళ్లకు మొక్కి

తన ఎమోషనల్ స్పీచ్ ముగియగానే వేదికపై నుంచి వచ్చి హీరో కార్తికేయ మెగాస్టార్ చిరంజీవికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు కార్తికేయను పైకి ఎత్తి హృదయపూర్వకంగా కౌగిలించుకొన్నారు. ఈ ఎమోషనల్ సీన్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా హార్ట్‌ను టచ్ చేసింది.

Recommended Video

Kartikeya's 90ML Trailer | Neha Solanki | Sekhar Reddy Yerra | Anup Rubens | #90MLTrailer
అజిత్, అల్లు అరవింద్ మూవీలో

అజిత్, అల్లు అరవింద్ మూవీలో

ఇదిలా ఉండగా, కార్తీకేయ ఇటీవల 90ml సినిమాలో తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. తాజాగా అల్లు అరవింద్ నిర్మించే చిత్రంలో, అలాగే తమిళ, తెలుగు భాషల్లో రూపొందే అజిత్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X