Kiran Abbavaram in LEO: లియో సినిమాలో కిరణ్ అబ్బవరం... ఇదేందయ్యా ఇది ... ఇది నేను చూడలా!
హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఇక ఇటీవల రూల్స్ రంజాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరోకు ఆ సినిమా పరాజయాన్ని ఇచ్చింది. ఇక తాజాగా లియో సినిమాలో కిరణ్ అబ్బవరం కెమియె అప్పిరియెన్స్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అసలు ఇందులో నిజమెంత.. లియో సినిమాలో కిరణ్ అబ్బవరం లేడు కదా అనే కదా మీ డౌట్.. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం.
రాజావారు.. రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. దీంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత సాయి కుమార్ తో కలిసి ఎస్ఆర్ కల్యాణ మండపం అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆయన వెనక్కి తిరిగిచూసుకోకుండా వరుస ఆఫర్లు వచ్చాయి.

ఇక వరుస పెట్టి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కానీ ఈ హీరోకు కలిసి రాక.. అన్ని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలుతున్నాయి. చివరగా వినరో బాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్టు కొట్టిన ఈ హీరో... ఇటీవల రూల్స్ రంజాన్ అనే సినిమాతో వచ్చాడు. ఇక ఈ సినిమా అయితే దారుణ పరాజయం మూటగట్టుకుంది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టడమే కాకుండా.. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ పై కూడా విమర్శలు, ట్రోలింగ్ తీసుకువచ్చింది.

ఇక ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో.. కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక ఈ మూవీలో అందాల భామ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుథ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో కిరణ్ అబ్బవరం కూడా నటించాడు అని సోషల్ మీడిాయలో వైరల్ గా మారింది.
అదేంటి అనుకుంటున్నారా... ఇది మేము చెప్పడం లేదు.. స్వయంగా ఆయన వికిపిడియాలోనే రాసి ఉంది. అయితే సినిమా చూసిన వాళ్లకి లియోలో ఎక్కడా కిరణ్ అబ్బవరం కనపడలేదు. కానీ వికీపీడియాలో మాత్రం కిరణ్ అబ్బవరం ఫిల్మో గ్రఫిలో లియో సినిమా చేసినట్లు ఉంది. అంతే కాదు ఆ పాత్ర పేరు అర్జున్ కల్యాణ్ అని రాశారు. దీంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అసలు లియో సినిమాలో కిరణ్ అబ్బవరం లేడు కదా.. ఇలా ఎందుకు ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక కిరణ్ అబ్బవరం యాంటి ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారని.. కావాలని వికీపిడియాలో ఇలా పెట్టి ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అంటూ ఆయన ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన నెక్ట్స్ సినిమాలతో బిజీ బిజిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











