Kiran Abbavaram: నెవ్వర్ బిఫోర్ అనేలా కిరణ్ అబ్బవరం స్టైలిష్ లుక్.. ఇలా అసలు ఊహించి ఉండరు!
టాలీవుడ్ లో హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి రాజావారు రాణిగారు మూవీతో బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో సెన్సేషన్ స్టార్ గా మారిపోయాడు. ఈ ఏడాది గీతా ఆర్ట్స్ 2 లో వినరో భాగ్యము విష్ణు కథ సూపర్ హిట్ కొట్టాడు.
వెంటనే మీటర్ మూవీ అనే మాస్ కమర్షియల్ సినిమా చేశాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టె బాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దీని తర్వాత రెండు నెలల క్రితం తొమ్మిదో సినిమాని కూడా స్టార్ట్ చేసేశాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కుర్ర హీరోకి యూత్ తో మంచి ఫాలోయింగ్ ఉంది. చూడగానే తమ ఫ్రెండ్ తరహాలో కనిపిస్తూ నేచురల్ యాక్టింగ్ తో కిరణ్ అబ్బవరం మెప్పిస్తాడు. ఈ కారణంగా అతనికి మంచి క్రేజ్ ఉంది. అలాగే మరీ శృతి మించి కాకుండా తనకి సెట్ అయ్యే కథలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ కుర్ర హీరో స్టైలిష్ మేకోవర్ తో డిఫరెంట్ లుక్స్ తో ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గామారాయి. బ్లాక్ కలర్ ప్యాంట్, షార్ట్ వేసుకొని కర్లింగ్ తరహాలో హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసుకొని స్టైలిష్ గా కూర్చున్నాడు. ఓ విధంగా పక్కా పోకిరి కుర్రాడి తరహాలో ఈ లుక్ లో కిరణ్ అబ్బవరం కనిపిస్తూ ఉండటం విశేషం. ఇప్పటి వరకు సింపుల్ గ ఫ్రెండ్లీ లుక్ లోనే అన్ని సినిమాలలో కనిపించిన కిరణ్ మొదటిసారి డిఫరెంట్ మేకోవర్ లో కనిపించడం విశేషం.
అయితే ఈ లుక్ ని ఏదైనా సినిమా కోసం ట్రై చేసాడా లేదంటే క్యాజువల్ ఫోటోషూట్ గా చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ లుక్ లో మాత్రం కిరణ్ అబ్బవరం స్టైలిష్ గా ఉండటంతో పాటు సరికొత్త అవతార్ లో దర్శనం ఇస్తూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











