హీరోయిన్‌తో ఎఫైర్... అడ్డంగా దొరికేసిన కుర్ర హీరో (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ.. ప్రేక్షకులను నిత్యం అలరిస్తూ ఉంటాడు. ఇక ఈ హీరో.. ఓ హీరోయిన్ ప్రేమలో మునిగిపోయాడా అంటే.. నిజమే అని అనిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... తన ప్రేమ గురించి ఇన్ డైరెక్టుగా బయటపెట్టేశాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎలా ప్రేమ కుదిరిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిరణ్ అబ్బవరం.. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. హీరోగా రాజా వారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో... ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపంతో మరో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి కుమార్.. కిరణ్ తండ్రిగా నటించగా ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ ఈ కుర్ర హీరోకు అంతగా కలిసి రావడం లేదు. దాదాపు అన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయి. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా పర్వాలేదనిపించినా... ఇటీవల రూల్స్ రంజాన్ సినిమాతో ప్రేక్షుకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా అయితే భారీ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాపై విమర్శలు రావడం సహజం.. కానీ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ పైనా కూడా విమర్శలు వచ్చాయి.
ఇక ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా పీపుల్స్ మీడియా దావత్ అనే ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఈ నిర్మాణ సంస్థ మొదటి సారిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. దీనికి హోస్టుగా అంటే యాంకర్ గా అషురెడ్డిని పెట్టారు. ఇక ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ఒకటి రీలీజ్ అయింది. ఇక ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం గెస్టుగా హాజరయ్యాడు. సింపుల్ లుక్ లో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ ప్రోమోలో... కిరణ్ అబ్బవరం పలు విషయాలను అషురెడ్డితో పంచుకున్నాడు. అయితే అషు రెడ్డి.. కిరణ్, రహస్య గోరఖ్ రిలేషన్ లో ఉన్నారా అని అడగింది. దీనికి కిరణ్ సమాధానమిస్తూ.. అలాంటిదేమి లేదు... ఉంటే మేమే చెప్తాం కదా అంటూ సిగ్గుపడిపోయాడు. ఏం చెప్తారు, ఇద్దరూ కలిసి డేట్ అనౌన్స్ చేస్తారా అని అషురెడ్డి ప్రశ్నించింది. దీంతో కిరణ్.. ఎప్పుడూ దొరకలేదు, ఈ షోలో ఏంటి ఇలా దొరికిపోయాను అంటూ ఓపెన్ అయిపోయాడు.
ఇక రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం కలిసి నటించిన చిత్రం రాజా వారు రాణివారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ కలిసి కాశ్మీర్ కి వెకేషన్ కి కూడా వెళ్లినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ దావత్ షోలో రహస్య పేరు చెప్పగానే కిరణ్ అబ్బవరం సిగ్గుపడిపోవడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. కుర్ర హీరో అడ్డంగా దొరికిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











