షూటింగ్ లో గాయపడిన హీరో మంచు విష్ణు.. అతని వల్లే అంటూ థాంక్స్..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎలాగైనా సరే మరో సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మంచు ఫ్యామిలీలో మంచి విష్ణు ఒక్కడే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఫుల్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న జిన్నా సినిమా కోసం అతను చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా షూటింగ్లో మంచి విష్ణు గాయపడినట్లు చెప్పారు.

అందుకు సంబంధించిన ఫోటోలు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ అలాగే పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక మంచు విష్ణు ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నాడో అతను పోస్ట్ చేసిన ఒక ఫొటో ద్వారా అర్ధమవుతోంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఒక పాట చిత్రీకరణలో, నటుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Hero manchu Vishnu injured badly on Ginna movie shooting

విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ విషయాన్ని స్టోరీలో పంచుకున్నాడు. నటుడు 2 వారాల పాటు రెస్ట్ మోడ్‌లో ఉండి, మళ్లీ షూట్‌ను ప్రారంభిస్తాడట. ఇలాంటి గాయం అవుతుందని తాను ఊహించలేదని ఏదేమైనా ప్రేమ్ రక్షిత్ కు థాంక్స్ చెప్పాలి అంటూ మంచు విష్ణు సరదాగా వివరణ ఇచ్చారు. ఇక ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జిన్నా సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇక ఈ సినిమాను AVA ఎంటర్‌టైన్‌మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్ణిస్తుండగా వచ్చే నెల అక్టోబర్ 5 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇదివరకే విడుదల చేసిన ఒక సాంగ్ కు మంచి క్రేజ్ అందింది. ఇక మంచు విష్ణు ఈ సినిమాలో డిఫరెంట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక వీలైనంత త్వరగా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి జిన్నా సినిమాతో మంచు విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X