గాలి నాగేశ్వరరావుగా మారబోతోన్న మంచు విష్ణు.. రంగంలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్!
మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు త్వరలోనే మరో కొత్త సినిమాలు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంత కాలంగా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న మంచు విష్ణు ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ కొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుగానే శ్రీను వైట్లతో మరో ఢీ లాంటి సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం కొనసాగుతొంది. ఢీ అండ్ ఢీ అనే టైటిల్ కూడా ఫైనల్ చేసి అప్పట్లో చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ కూడా చేశారు.
ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అని మంచు విష్ణు శ్రీనువైట్ల చర్చలు జరుపుతున్నారు. అయితే ఆ ప్రాజెక్టు లైన్ లో ఉండగానే మంచు విష్ణు మరొక సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి అని చూస్తున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఆ ప్రాజెక్టు పై అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. సూర్య అనే ఒక కొత్త దర్శకుడితో మంచు విష్ణు సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. సినిమాకు 'గాలి నాగేశ్వరరావు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ విషయంలో కూడా ముందుగానే విష్ణు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు.

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే తో పాటు కథను కూడా అందించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి చిత్ర యూనిట్ కి అందించారు. భాను - నందు సినిమాకు డైలాగ్స్ అందిస్తుండగా చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా మరో సారి విష్ణు సినిమాకు వర్క్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. మంచు విష్ణు అయితే ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతోంది.
ఇక చివరగా మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ఇంగ్లీషులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో అంచనాలను అందుకోలేక పోయింది. ఇక అందుకే తదుపరి సినిమాలతో విష్ణు మళ్లీ ఫామ్ లోకి రావాలి అని చూస్తున్నాడు. కేవలం సినిమాలతోనే కాకుండా మరొక వైపు టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో మంచి ఫ్యామిలీ పై వస్తున్న ట్రోల్స్ పై కూడా విష్ణు సీరియస్ అయ్యారు. మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పరువు నష్టం దావా వేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











