కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కోసం.. క్షణాల్లో 5 లక్షలు ట్రాన్స్‌ఫర్.. రాంచరణ్ గురించి మనోజ్ మంచు

గ్లోబల్ స్టార్ రాంచరణ్ మార్చి 27వ తేదీన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో అభిమానులు ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దిల్ రాజు, మంచు మనోజ్ తదితరులు మెగా పవర్ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ..

చిన్నతనంలో మా ఫ్యామిలీ, రాంచరణ్ కుటుంబం చెన్నైలో ఒకే చోటు ఉండేవాళ్లం. బాల్యం నుంచి మాకు మంచి అనుబంధం ఉండేది. రాంచరణ్ నాకు ప్రాణ స్నేహితుడు. తనకు తెలిసినా, తెలియకపోయినా ఎదుటి వ్యక్తి కష్టాల్లొ ఉండే ఆదుకొంటాడు. అలాంటి అతడి బర్డ్ డే ఈవెంట్‌లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. మెగా అభిమానులు చేసే ఈవెంట్లు కన్నుల పండువగా ఉంటుంది అని మంచు మనోజ్ అన్నారు.

Hero Manoj Manchu praises Ram Charan for donating 5 Lakhs to Girl in Dubai Victimised

రాంచరణ్ లాంటి మనస్తత్వం ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. అందుకే అతడి కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఈ రోజుల్లో అత్యంత విలువైనది స్నేహం. మనిషి ఎదిగినప్పుడు కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడుతాయి. పాతవారిని మరిచిపోతుంటారు. కానీ చిన్నప్పటి నుంచి ఎవరితో స్నేహం ఉందో.. ఇప్పటికీ అందరితో కలిసే ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి రాంచరణ్ అని మనోజ్ చెప్పారు.

ఓ సమయంలో నేను యూఎస్‌లో ఉన్నాను. ఆ సమయంలో దుబాయ్‌లో ఓ ఆడపిల్లకు కష్టం వచ్చింది. ఆ సమయంలో నా వద్ద డబ్బు లేదు. నేను చేయాల్సిన సహయం చేస్తున్నాను. అక్కడ వారి పరిస్థితి దారుణంగా మారింది. వారి చేత సంతకాలు చేయించుకొని పాస్‌పోర్టులు లాగేసుకొన్నాడు. ఆ పరిస్థితి నుంచి అమ్మాయిని ఎలా బయటపడేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను అని మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.

ఆ సమయంలో అర్ధరాత్రి రాంచరణ్‌కు ఫోన్ కాల్ చేసి.. దుబాయ్‌లో అమ్మాయి కష్టం గురించి చెప్పాను. 5 లక్షలు అవసరం ఉందని చెప్పాను. దాంతో వెంటనే నాకు అకౌంట్ నంబర్ పంపించమని చెప్పాడు. ఫోన్ పెట్టేసి ఓ క్షణంలో 5 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అది రాంచరణ్ మనస్తత్వం. ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉన్నారంటే తట్టుకోలేడు అని రాంచరణ్ అన్నారు.

రాంచరణ్‌కు అందరి ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు చెర్రీ గ్లోబల్ స్టార్. అతడికి మరిన్నీ విజయాలు దక్కాలి. అలాగే పవన్ కల్యాణ్ అన్నయ్యకు బెస్టాఫ్ లక్. మా తండ్రి, చిరంజీవి మధ్య గొడవలు టామ్ అండ్ జెర్రీ లాంటి కొట్లాటలు. వారిద్దరూ కలిసి ఉండాలి అని మనోజ్ తన ప్రసంగాన్ని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X