For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల తరువాత నాగ చైతన్య మొదటి పోస్ట్.. జీవితానికి అదొక గ్రీన్ లైట్ అంటూ స్పెషల్ ఫొటో..

  |

  టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాలావరకు నాగచైతన్య సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. సినిమాల విషయాలు అలాగే తనకు ఇష్టమైన కార్ల విషయాలను తప్పితే పర్సనల్ విషయాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో చర్చించడానికి ఇష్టపడడు. అయితే ఇటీవల మాత్రం నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు నెలన్నర పాటు నాగ చైతన్య సోషల్ మీడియా కు దూరంగానే ఉన్నాడు. ఇక శనివారం రోజు నాగ చైతన్య ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేయడంతో అది నిమిషాల్లోనే వైరల్ అయింది.

  సింపుల్.. సోలో లైఫ్

  సింపుల్.. సోలో లైఫ్

  హీరో నాగ చైతన్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించి దాదాపు ఒకటిన్నర నెలలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పటి నుంచి చైతు ఎలాంటి పోస్ట్ చేయలేదు. గతంలో చైతు కనీసం తనకు ఇష్టమైన బైక్స్ కార్లకు సంబంధించిన ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి ఫోటోలను కూడా పోస్ట్ చేయడం లేదు. చైతన్య చాలావరకు సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ సోలో లైఫ్ ను చాలా సింపుల్ గా నడుపుతున్నట్లు తెలుస్తోంది.

  విడాకుల తరువాత

  విడాకుల తరువాత

  నాగచైతన్య అండ్ సమంత కాస్త ఎక్కువగా తన స్నేహితులతో విహారయాత్రలు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తోంది. అంతేకాకుండా ఆమె సినీ జీవితంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసేందుకు కూడా డిసైడ్ అయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమెకు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య మాత్రం షూటింగ్స్ తప్పితే మరే విధమైన ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకోవడం లేదు కదా.

  ఇష్టపూర్వకంగానే..

  ఇష్టపూర్వకంగానే..

  అక్టోబర్ 2వ తేదీన సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య ఎలాంటి వివాదాలు లేకుండా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఒకరి జీవితాన్ని మరొకరు అర్థం చేసుకుని విడిపోతున్నట్లు చెబుతూ ఇకపై మంచి స్నేహితులు గా ఉండడానికి అడుగులు వేయబోతున్నట్లు కూడా వివరణ ఇచ్చాడు. అయితే నాగచైతన్య ఆ తర్వాత మళ్లీ మరొక పోస్ట్ అయితే చేయలేదు. కానీ సమంత మాత్రం ఏదో ఒక విధంగా జీవితానికి సంబంధించిన అనేక రకాల అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

  జీవితానికి ప్రేమలేఖ

  జీవితానికి ప్రేమలేఖ

  ఇక చాలా కాలం తర్వాత నాగచైతన్య ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేయడం విశేషం. దానికి సంబంధించిన చాలా అంశాలను నాగ చైతన్య తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్‌కోనాఘే రాసిన గ్రీన్‌లైట్స్ అనే పుస్తకం యొక్క ఫోటోగ్రాఫ్‌ను నాగ చైతన్య షేర్ చేసుకున్నాడు. "జీవితానికి ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్.. ఎంతో గౌరవం సార్" అని పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అవ్వడం విశేషం.

  Tollywood Stars Top 10 Rankings : Prabhas మూడు.. Allu Arjun రెండు || Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే..

  సినిమాల విషయానికి వస్తే..

  ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య తన తండ్రి హీరోగా చేస్తున్న బంగార్రాజు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక విక్రమ్ కుమార్ తో థాంక్యూ సినిమాతో పాటు ఒక హారర్ త్రిల్లర్ జానర్ లో వెబ్ మూవీ చేయనున్నాడు. ఇక అమీర్ ఖాన్ యొక్క లాల్ సింగ్ చద్దా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Hero Naga chaitanya akkineni special post after divorce..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X