KA: కిరణ్ వాళ్లకు భయపడాల్సిన పనిలేదు.. వారికి బుర్రలో గుజ్జు లేదు.. నాగచైతన్య ఫైర్

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ క (KA) మూవీ గ్రాండ్‌గా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో యువ సామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన స్పీచ్ వివరాల్లోకి వెళితే..

కిరణ్ అభిమానులందరికీ నమస్కారం. కిరణ్‌ను చెన్నైలో కలిశాను. రెండు గంటలపాటు మాట్లాడిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత క సినిమా ట్రైలర్ చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన ఓ రోజు ఫోన్ చేసి క ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానిస్తే గర్వంగా ఫీలయ్యాను అని నాగచైతన్య అన్నారు.

Hero Naga Chaitanya Sharp Attack on Trollers on Kiran Abbavaram s KA Movie

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. నాకు ఆ కష్టాలు తెలియవు. కానీ కిరణ్ అబ్బవరం స్వయంగా ఎదిగాడు. ఎన్నో కష్టాలను అధిగమించారు. ఆయన జర్నీ అమెజింగ్. నీకంటూ గొప్ప ఇమేజ్‌ సంపాదించుకొన్నావు అని నాగచైతన్య అన్నారు.

క (KA) చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా యూనిట్‌కు నా శుభాకాంక్షలు. కిరణ్ నీ జర్నీ అందరికి ఓ ఇన్సిపిరేషన్. నేను నీకు నంబర్ వన్ ఫ్యాన్‌ను. ప్రతీ యాక్టర్, ఫిల్మ్ మేకర్‌కు నీ ప్రయాణం అమేజింగ్. ప్రతీ ఒక్కరు గొప్పగా గుర్తు పెట్టుకొంటారు అని నాగచైతన్య ప్రశంసలు గుప్పించారు. దాంతో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు.

క మూవీ సినిమా ప్రమోషన్స్‌లో మీ ఇంటర్వ్యూలు చూశాను. మీడియా నుంచి చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవడం చూశాను. చాలా మంది ర్యాగింగ్ చేసినట్టు, విపరీతంగా ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే.. మీరు మెచ్యురిటీతో చెప్పిన సమాధానాలు బాగున్నాయి. మీరు నిజాయితీతో సినిమాలు చేస్తారు. మీలో ఎంతో శక్తి ఉంది. దేనికి భయపడకు అంటూ కిరణ్ అబ్బవరంకు నాగచైతన్య ధైర్యాన్ని నూరిపోశాడు.

కొంతమంది ట్రోల్ చేసే వాళ్లు ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోకు. వాళ్ల చేతిలో కీ బోర్డు, మొబైల్ ఉంటుంది. అలాంటి వాళ్లకు బుర్రలో గుజ్జు లేదు. వారి గురించి భయపడాల్సిన పనిలేదు. మీరు ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు. ప్రతీ సినిమాకు నీ రేంజ్ పెరుగుతున్నది. ప్రతీ యాక్టర్ కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. క బ్లాక్ బస్టర్ సినిమా. వారు ఎంత కష్టపడ్డారో వారితో మాట్లాడితే అర్ధమైంది అని నాగచైతన్య ఘాటుగా కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X