Bomma Blockbuster బలిసి సినిమాలు తీయడం లేదు.. బతకలేక.. వేరేది చేతకాక.. నందూతో నాగశౌర్య కంటతడి!
నందూ, రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా నాగశౌర్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయ్ భవ బ్యానర్ మంచి సినిమా తీసిందని నమ్ముతున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను. నలుగురు నిర్మాతలు నందూకి మంచి సపోర్ట్ ఇచ్చారు. టాలీవుడ్‌కు పరిచయమవుతున్న నిర్మాతలందరికి స్వాగతం అని నాగశౌర్య అన్నారు. ఇంకా నందూ, రష్మీ గురించి మాట్లాడుతూ..

వైజాగ్ థియేటర్ ఆర్టిస్టులు కష్టపడి..
బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి ప్రతిభావంతులైన కొత్తవారు ప్యాషన్‌తో పనిచేశారు. కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మీరు కష్టాలు పడ్డారని తెలిసింది. అసలు కష్టాలు రిలీజ్‌తో ప్రారంభమవుతాయి. కష్టమంటే ఏమిటో తెలుసుకోవాలంటే.. నందూను చూస్తే తెలుస్తుంది. వైజాగ్ థియేటర్ ఆర్టిస్టులకు నా హ్యాట్సాఫ్. సినిమా తెరపై రాణించాలని వారంతా చాలా కష్టపడ్డాయి. థియేటర్ నుంచి సినిమా పరిశ్రమకు వచ్చిన వారందరూ కూడా ఎలాంటి బెరుకు లేకుండా నటించారు అని నాగశౌర్య అన్నారు.

రష్మీ గౌతమ్ ఆటోలో తిరుగుతూ
రష్మి గౌతమ్ గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. నేను, నందూ తెలియకపోవచ్చు. కానీ టీవీ చూసే ప్రతీ ఒక్కరికి రష్మీ గౌతమ్ గురించి తెలుసు. ఇంత తెలిసిన వ్యక్తి.. పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ ప్రమోషన్స్ కోసం.. ఆటోలో ప్రయాణిస్తూ.. రోడ్లపైకి తిరగడం చూస్తే నిజంగా సినిమా కోసం ఎంత కష్టపడుతుందో అర్దమవుతుంది. రెమ్యునరేషన్ తీసుకొని లగ్జరీ కార్లలో తిరుగారని అందరూ అనుకొంటారు. సినిమా కోసం మేము ఎంత కష్టపడుతామో మీకు తెలియదు. సొంతంగా ఖర్చు పెట్టుకొని సినిమాను రష్మీగౌతమ్ ప్రమోషన్ చేయడం నిజంగా హ్యాట్సాఫ్ అని నాగశౌర్య తెలిపారు.

నాకు యాక్టింగ్ తప్ప.. మరోటి తెలియదు..
మాకు యాక్టింగ్ తప్ప ఏమీ తెలియదు. యాక్టింగ్ తప్ప నాకు మరో విషయం తెలియదు. ఏమీ చేతకాదు. 2007 చివర్లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటికే నందూ హీరో. ఇండస్ట్రీలో నందూకు రావాల్సిన పాపులారిటీ రాలేదు. యష్‌కు కేజీఎఫ్‌లా, అల్లు అర్జున్‌కు పుష్పలా నందూకు ఒక సినిమా పడాలి. నందూకు రెస్పక్ట్ రావాలి. నందూ అంటే నాకు బాగా రెస్పెక్ట్. నా సినిమాకు నందూను చీఫ్ గెస్ట్‌గా పిలుస్తాను అని నాగశౌర్య పేర్కొన్నారు.

బతకలేక కడుపులు మాడ్చుకొని..
సినిమాలను చూడటానికి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు రావాలి. మేము బలిసి తీయడం లేదు. ఏమి చేయడం తెలియక.. బతకలేక కడుపులు మాడ్చుకొని.. ఎక్సర్‌సైజులు చేస్తూ.. సినిమాలు చేస్తున్నాం. నచ్చితే సినిమా చూడండి.. కానీ థియేటర్‌కు రండి. ఈ సినిమా నాకు ఎమోషనల్ అని నాగశౌర్య ఎమోషనల్ అయ్యాడు.

పూరీ జగన్నాథ్ ఫ్యాన్ అంటూ
బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలో నాకు నచ్చిన వ్యక్తి పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలు చూస్తూ.. ఆయన డైలాగ్స్ వింటూ.. నాకు ఇలాంటి సినిమా పడితే.. ఇలాంటి డైలాగ్స్ పడితే.. అని అనుకొంటూ పెరిగాం. పూరీ సార్.. మీ ఫ్యాన్స్ కూడా బ్లాక్ బస్టర్ సినిమా చూడాలని కోరుకొంటున్నాం. సినిమా పిచ్చోడైతే.. అది పూరీ జగన్నాథ్ ఫ్యాన్ అయి ఉంటారు. అది నిజం. పోస్టర్‌పై పూరీ బొమ్మ చూస్తే నేను ఎమోషనల్ అయ్యాను. సినిమా ఎలా ఉన్నా.. మీరు థియేటర్‌కు రండి.. ఆ తర్వాత మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఒకే అని నాగశౌర్య చెప్పారు.


Click it and Unblock the Notifications











