twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Shourya తండ్రి అరెస్ట్.. కేసులో కొత్త మలుపు.. ఊహించని విధంగా పోలీసుల అదుపులోకి!

    |

    టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తున్నాడు. వరుడు కావలెను సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఆయనకు చెందిన మంచిరేవుల ఫాం హౌస్ లో పేకాట నిర్వహిస్తూ ఉండగా తెలంగాణ పోలీసులు దాడి చేయడం సంచలనం రేపింది. తాజాగా ఈ మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ అరెస్టయ్యారనీ అంటున్నారు. శివలింగ ప్రసాద్ ను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. క్యాసినో బ్రోకర్ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని అంటున్నారు.
    టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ కావడం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. టాలీవుడ్ హీరో తండ్రి శివలింగ ప్రసాద్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

    పేకాట వ్యవహారంతో

    పేకాట వ్యవహారంతో

    టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తున్నాడు. వరుడు కావలెను సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఆయనకు చెందిన మంచిరేవుల ఫాం హౌస్ లో పేకాట నిర్వహిస్తూ ఉండగా తెలంగాణ పోలీసులు దాడి చేయడం సంచలనం రేపింది. తాజాగా ఈ మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ అరెస్టయ్యారనీ అంటున్నారు. శివలింగ ప్రసాద్ ను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. క్యాసినో బ్రోకర్ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని అంటున్నారు.

    అరెస్టయిన వెంటనే బెయిల్ కోసం

    అరెస్టయిన వెంటనే బెయిల్ కోసం

    ఇక అరెస్ట్ అయిన వెంటనే కాగా శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు. ఫామ్‌ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే బాస్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య ఫాదర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఈ పేకాట కేసులో నాగశౌర్య తండ్రి శివ లింగ ప్రసాద్‌కు ముందు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక విల్లాలో పేకాట ఆడిన కేసులో 30 మందిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

     పుట్టిన రోజు పేరుతో పార్టీలు

    పుట్టిన రోజు పేరుతో పార్టీలు

    వీరిలో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ చౌదరి బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను అద్దెకు తీసుకున్నట్లు ముందు పోలీసులు తేల్చారు. ఈ ఫార్మ్ హౌస్ ను దాని ఓనర్ రిటైర్డ్ ఐఏఎస్ గార్గ్ నుంచి నాగశౌర్య తండ్రి శివ లింగ ప్రసాద్ లీజుకు తీసుకున్నాడని నార్సింగి పోలీసులు ఆధారాలు సేకరించారు. గుత్తా సుమన్ అనే ఒక కాసినో బ్రోకర్ గతంలో బడాబాబులను తీసుకుని కొలంబో, గోవా తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి గాంబ్లింగ్ ఆడించేవారు. అయితే అలా చేయడం కంటే ఇక్కడ పేకాట ఆడిస్తే ఎక్కువ డబ్బు వస్తాయని భావించి పుట్టినరోజు వేడకల పేరుతో నాగ శౌర్య తండ్రి ఫామ్ హౌస్ లో పేకాట ప్లాన్ చేశారు.

     పోలీసుల మెరుపు దాడి

    పోలీసుల మెరుపు దాడి

    అయితే అక్కడ పేకాట ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు చిక్కారు. దాడి చేసిన సమయంలోనే గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో గుత్తా సుమన్ కు సంబంధాలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

    Recommended Video

    Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
     సినిమా ఫక్కీలో

    సినిమా ఫక్కీలో

    పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారోననే విషయమై సుమన్ కుమార్ సమాచారం చేరవేసేవాడనీ, డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనేవాడని కూడా గుర్తించారు. ఈ డబ్బు తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ ను ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు. దీని వెనుక నాగశౌర్య తండ్రికి కూడా హస్తం ఉందని తెలియడంతో ఆయనను కూడా అరెస్టు చేశారు.

    English summary
    Hero Naga Shaurya father mulpuri Siva Linga prasad arrested in gambling case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X