ఆన్‌లైన్ క్లాసుల్లో బిజీబిజీగా నాగార్జున.. సమయం తప్పకుండా పాఠాలు..
కింగ్ నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉండేలా చేసుకుంటాడు. కథ ఎంత కొత్తగా ఉంటే అంత తొందరగా ఫినిష్ చేస్తాడు. నాగార్జున కనెక్ట్ అయితే పని ఆగకుండా వెళుతున్నట్లు ఉంటుందట. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే విషయాన్ని ఎక్కువగా చెబుతుంటారు. ఇక తరువాత సినిమా కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ కారణంగా మళ్ళీ షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. సీనియర్ నటీనటులు టెక్నీషియన్స్ ఎవరు కూడా రిస్క్ చేయాలని అనుకోవడం లేదు. అయితే కరోనా టైమ్ లో గత ఏడాది అందరికంటే ముందుగా మేకప్ వేసుకున్న వారిలో కింగ్ నాగార్జున ఒకరు. బిగ్ బాస్ ను ఎన్నో జాగ్రత్తల నడుమ ధైర్యంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వలన డోస్ ఎక్కువవ్వడంతో ఇంట్లోనే ఉండక తప్పడం లేదు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం నాగార్జున మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి ఉందట. ముందుగానే విదేశీ మార్షల్ ఆర్ట్స్ నిపుణుల ఆధ్వర్యంలో నేర్పించాలని అనుకున్నారట. కానీ కరోనా కారణంగా వాళ్ళు రాకపోవడంతో ఆయన రెగ్యులర్ గా ఆన్ లైన్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా కత్తికి సంబంధించిన టెక్నీక్స్ నెర్చుకుంటున్నట్లు సమాచారం. మళ్ళీ కరోనా తగ్గుముఖం పట్టె వరకు నాగార్జున ఆన్ లైన్ లోనే అన్ని పాఠాలు నేర్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











