Balakrishna on Kodali Nani: నేను విగ్గు పెట్టుకుంటే నీకేంటయ్యా.. నీవు వేటితో గడ్డం పెట్టుకున్నావ్!
Balakrishna on Kodali Nani: నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన ప్రేమ, అభిమానం గురించి సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు నచ్చిన వాళ్లకు ఎంత చనువు ఇస్తారో.. ఎవరైనా తప్పు చేస్తే కూడా అదే రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రేమిస్తే ప్రాణమిచ్చే ఆయనే.. తప్పులు మాట్లాడిన వారిపై ఉగ్రరూపం ఎత్తుతుంటారు. అలాగే కొన్నిసార్లు తనపై తప్పుడు కామెంట్లు చేసే వారిపై చాలా కామెడీగా కూడా స్పందిస్తారు. తాజాగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు.
బాలకృష్ణ కొడాలి నాని పేరు నేరుగా చెప్పకుండానే ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. తనతో పని చేసిన డైరెక్టర్లు, ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల గురించి వివరించారు. క్యారవాన్లు లేని సమయంలో వారంతా చెట్ల కింద ఓ చాప వేసుకొని హాయిగా తినేవాళ్లం అని, అక్కడే కాసేపు పడుకునే వాళ్లమని అన్నారు. తన అక్కడి వాళ్ల ముందు ఏమాత్రం భయం, బెరుకు లేకుండా విగ్గు తీసి పక్కన పెట్టి మరీ పడుకునే వాడినని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇలా చెబుతూ ఉండగానే... ఆయన సడన్ గా ఫైర్ అయ్యారు.

ఓ వెధవ.. బాలకృష్ణ విగ్గు పెట్టుకుంటారని అని ఎద్దేవా చేస్తూ అడిగారని తెలిపారు. తాను విగ్గు పెట్టుకుంటే వాడికేమయ్యిందో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఏం తీసుకొచ్చి గడ్డం పెట్టుకున్నావయ్యా అంటూ రివర్స్ కామెంట్లు చేశారు. బాలయ్య బాబు ఇలా ఫైర్ అవ్వగానే అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. దీంతో బాలకృష్ణ కూడా కాస్త కూల్ అయి మరింతగా నవ్వారు. ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన పేరు తీయకుండానే ఫైర్ అయినప్పటికీ.. ఆ కామెంట్లు మంత్రి కొడాలి నానిపైనే చేశారని, గతంలో ఆయనే బాలకృష్ణ విగ్గు గురించి మాట్లాడారని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బాలకృష్ణ హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమాకు సంబంధిచిన టీజర్, ట్రైలర్ పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే క్యూట్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.

అక్టోబర్ 19వ తేదీన భగవంత్ కేసరి చిత్రాన్ని భారీ స్ఠాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల, బాలకృష్ణలు చాలా బిజీగా మారిపోయారు. గ్రూపుగా, సింగిల్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ చెలరేగిపోతున్నారు. మరి ఇంతగా బజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టవుతుందో.. ఎన్ని కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీసును షేక్ చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











