దటీజ్ బాలయ్య.. మాట ప్రకారమే వారితో లంచ్.. కాలర్ ఎగరేస్తున్న ఫాన్స్!
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి నట వారసుడుగా ప్రవేశం చేసిన ఆయన తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. నందమూరి బాలకృష్ణ అంటే చాలా మంది అభిమానులు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి అభిమానుల కోసం బాలకృష్ణ కూడా ఎంత దాకా వెళ్లడానికైనా వెనుకాడరు. తాజాగా బాలకృష్ణ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన వివరాలలోకి వెళితే

కలుస్తానని
నందమూరి బాలకృష్ణ గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆయనను ఇతర హీరోలలో అభిమానులు ఆ విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అభిమానులు పెట్టినా కొట్టినా మా బాలయ్యే అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణ అభిమానిని ఒక సారి కర్నూలు వచ్చిన సమయంలో కలుస్తానని మాట ఇచ్చారట.

స్వయంగా ఫోన్ చేసి
సాధారణంగా హీరోలు అభిమానులను కలిసిన సందర్భాల్లో ఎప్పుడైనా మా ఇంటికి రమ్మంటే వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ పంపిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. ఇక్కడ కూడా బాలకృష్ణ గారు అలాగే చెప్పుంటారులే అనుకున్నాడు సదరు అభిమాని. అయితే కర్నూలుకి తన సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన నందమూరి బాలకృష్ణ ఆ అభిమానిని స్వయంగా ఫోన్ చేసి కుటుంబ సమేతంగా పిలిపించి వాళ్లతో కలిసి భోజనం చేశాడు.

అద్దంలో చూపిస్తూ
అంతే కాదు వారితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ కుటుంబంలో బాబుతో కలిసి ఫోటో దిగడానికి నందమూరి బాలకృష్ణ ప్రయత్నించారు అయితే జనాలు ఉండడంతో కాస్త భయపడిన బాబు ఏడుస్తూ ఉండడంతో తానే స్వయంగా ఎత్తుకుని బాలకృష్ణ అద్దంలో చూపిస్తూ మరిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు దట్ ఈజ్ బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మలినేని దర్శకత్వంలో
ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరియర్లో 107వ సినిమాగా పొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ నటుడు లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

సోషల్ మీడియాలో వైరల్
కానీ ఆ విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇప్పటివరకు లేదు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రిలీజ్ కి సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అభిమానుల కుటుంబంలో కలిసి భోజనం చేస్తున్న వీడియోతో పాటు బుడతడిని ఆడిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











