పెద్ద మనసు చాటుకున్న నాని.. రక్తదానం చేసిన స్టార్
ప్రస్తుతం కరోనా కోరల్లో ప్రపంచం చిక్కుకుంది. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. మన దేశంలో కూడా గత నెల నుంచి లాక్ డౌన్‌లోనే ఉంది. తాజాగా మరోసారి ఇంకో 19 రోజుల పాటు పొడిగించారు. ఇలాంటి స్థితిలో మరో విపత్కర పరిస్థితి ఏర్పడింది.
లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అవ్వడం రక్తం నిల్వలు తగ్గిపోయాయి. బ్లడ్ బ్యాంక్‌లో కూడా రక్తం లేకుండా పోయింది. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని ముందుకు వచ్చి రక్త దానం చేశాడు.

రక్త దానం చేసిన నాని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అందించాడు. ఈ విషయానికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. అలాగే గివ్ బ్లడ్ సేవ్ లైఫ్... నినాదంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులకు రక్త దాతల కొరత తీవ్రంగా వేధిస్తోందని అందరూ రక్తదానం చేయండని నాని పిలుపునిచ్చాడు.


Click it and Unblock the Notifications











