For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nani Accident: హీరో నానికి యాక్సిడెంట్.. అతడిపై పడిన బొగ్గు లోడ్.. ఇప్పుడెలా ఉందంటే!

  |

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేసే అతడు.. ఎన్నో హాట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడం కోసం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు, వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే నాని ప్రస్తుతం 'దసరా' అనే సినిమా చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని షూటింగ్ స్పాట్‌లో ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఆ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్

  ఆ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్


  'జెర్సీ' తర్వాత నేచురల్ స్టార్ నాని చేసిన 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. ఆ తర్వాత 'వీ', 'టక్ జగదీష్' వంటి సినిమాలు చేసినా.. అవి ఓటీటీల్లోనే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో ఈ స్టార్ హీరో విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, దీనితో మరోసారి నాని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

  ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

  అంటే... సుందరానికి పరాభవమే

  అంటే... సుందరానికి పరాభవమే


  ఇటీవలే నేచురల్ స్టార్ నాని 'అంటే.. సుందరానికీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, తెలుగు ప్రేక్షకుల నుంచి ఆ తర్వాత స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ సినిమా ప్రతికూల ఫలితాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు దాదాపు పది కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి.

   దసరా మూవీ.. మాస్ రోల్‌లో నాని

  దసరా మూవీ.. మాస్ రోల్‌లో నాని


  నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం'దసరా' అనే సినిమాను చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

  శృతి మించిన గబ్బర్ సింగ్ బ్యూటీ హాట్ షో: ఆమె డ్రెస్ చూస్తే మెంటలెక్కిపోవడమే!

  శరవేగంగా సాగుతోన్న చిత్రీకరణ

  శరవేగంగా సాగుతోన్న చిత్రీకరణ


  నాని హీరోగా విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న 'దసరా' మూవీ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. మరీ ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో పలు కీలకమైన సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌‌ను తీశారు.

  షూటింగ్‌లో నానికి యాక్సిడెంట్

  షూటింగ్‌లో నానికి యాక్సిడెంట్


  నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గోదావరిఖని బొగ్గు గనుల్లో జరుగుతోన్న 'దసరా' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి ప్రమాదం జరిగిందని ఓ న్యూస్ తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఓ టిప్పర్‌లో ఉన్న బొగ్గు లోడ్ హీరో నాని మీద పడిందని తెలుస్తోంది. దీంతో వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అతడిని బయటకు తీశారని సమాచారం.

  'ఖిలాడి' హీరోయిన్ హాట్ వీడియో వైరల్: లోదుస్తులు కూడా తీసేసి ఘోరంగా!

  నానికి గాయాలు... షూటింగ్‌లోనే

  నానికి గాయాలు... షూటింగ్‌లోనే


  'దసరా' షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో నేచురల్ స్టార్ నానికి స్వల్ప గాయాలే అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడు వెంటనే షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పాడని సమాచారం. ఇక, ఈ ఊహించని సంఘటనతో దసరా మూవీ యూనిట్ మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిసింది. అయితే, నానికి పెద్ద పెద్ద గాయాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  English summary
  Tollywood Star Hero, Natural Star Nani Now Doing Dasara Movie Under Srikanth Odela Direction. Now He Met With an Accident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X